ఆగస్టు 12వ తేదీ జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు రాజేశ్వరి దివాకర్ల.
~
మౌనం మాటలాడుతుంది. నిశ్శబ్దం పలుకుల మూట విప్పుతుంది. సమూహం లో ఏకాంతం చక్కని తోడు నిస్తుంది. వివక్షత లెరుగని చోటు ఉచిత ఆసనం వేస్తుంది.
దళసరి కళ్ళజోడొకటి దిన పత్రిక తొలి శీర్షిక తరువాయి పుటకు మలుపు తిరిగే కాగితం స్పర్శ ఆత్మీయమౌతుంది.
బరువు పుస్తకాలను కొనలేని చదువుల దీక్ష ఆధార సంపుటాలను హృదయ శీర్షానికి ఎత్తి భుజ కీర్తులకొక బాట వేస్తుంది.
కథలు, నాటకాలు, కవితల వరుస కితాబుల గూడు ధ్యాన ముద్రల సొదల కళ్ళు తెరుస్తుంది.
ఇంటి పనులన్ని తీరి వచ్చిన వేళ కాల్పనిక లోకాన కాస్తింత సేపు తిరిగి రమ్మని తనివి తీర్చగ నవలా మణి చేతికందుతుంది.
అక్షర సంహితల ఆకాశ హర్మ్యమొక్కటి పుడమికి దిగి వచ్చి గ్రంథాలయం అని పేరు పెట్టుకుంది. తర తరాల జ్ఞాన సోపానమును పరచి దరికి రమ్మని సమ్మతికి పిలుపును ఇచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ముద్రారాక్షసమ్ – పఞ్చమాఙ్కః – 5
అపర ‘భారవి’ కీ.శే. చిల్లర భావనారాయణరావు గారు
ఆథర్స్ అండ్ స్టోరీస్ కథల సంకలనం 2018 – పుస్తక పరిచయం
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 44: కొండవీడు
సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-9
సంచిక పద ప్రహేళిక ఫిబ్రవరి 2021
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-6
సంపాదకీయం ఫిబ్రవరి 2019
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-8 & 9
ఊతం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®