[వి. భాగ్యలక్ష్మి గారు రచించిన ‘ఆకాంక్ష’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కవితలు రాసే కవయిత్రిని కాను
పాటలు పాడే గాయనిని కాను
సాధారణ విద్యార్థిని నేను
కాని రాయాలన్న ఆకాంక్ష గలదు
క్రొత్తగా చిగురించే చిగురు వంటిది
వికసించే పువ్వులోని పరిమళం వంటిది
స్వచ్ఛమైన ఆవుపాల నురగ వంటిది
నా ఈ తొలి కవిత!
ఉదయించే సూర్యున్నుంచి నేలను తాకిన
తొలి కిరణం వంటిది
అప్పుడే రెక్కలు విప్పార్చి ఎగరాలని
యత్నించే సీతాకోక చిలుక వంటిది
పసిపిల్లల లేతబుగ్గల్లోని పసితనం
వంటిది నా ఈ తొలి కవిత!
నా కరములోని కలము నా కలల సాధనం
ఆలోచనలనే అలలతో ఎగసిపడితున్న
కడలి వంటిది నా అంతరంగం
నా మనో భావనలు
అక్షరరూపం దాల్చిన సమయం
నా ఈ తొలి కవిత!