[డా. షహనాజ్ బతుల్ రచించిన ‘ఆడంబరాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
1.
ఒకప్పుడు కొంతమందికి ఉండేవి
ఆడంబరాలు.
ఇప్పుడు కూడా ఉన్నాయి ఆడంబరాలు.
అప్పుడు చాలా తక్కువ చేసేవారు
ఆడంబరాలు.
ఇప్పుడు చాలామంది చేస్తున్నారు ఆడంబరాలు.
ఇప్పుడు ఒక ఆనవాయితీ అయిపోయింది బత్తులా.
2.
కొంతమంది మహిళలు ఒకరిని చూసి
కొంటారు నగలు.
కొంతమంది ఒకరిని చూసి కొంటారు చీరెలు.
భర్త జీతము ఆలోచించకుండా కొంటారు నగలు.
భర్తను ప్రేరేపిస్తారు చెయ్యడానికి అప్పులు.
తమ తాహతు ఎంత ఉందో గుర్తుకు రాదు బత్తులా.
3.
ధనవంతులు వేడుకలు ఆడంబరంగా చేస్తారుగా.
మధ్యతరగతి వాళ్ళు
ఆడంబరంగా చేస్తారుగా.
ధనవంతులను చూసి వీళ్లు చేస్తారు గా.
బాధపడేది మధ్యతరగతి వారేగా.
మీ దగ్గర డబ్బు ఉన్నంతలో చేసుకోవాలి బత్తులా.