సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Yamini Devi

    ధన్యవాదాలు గురువర్యా 🙏
    ఎంతగానో నేను ఎదురు చూసిన ఈ భాగం బావుంది. కొన్ని సంస్కారాలు మీరన్నట్టు పిల్లలకు చిన్ననాటి నుంచి నేర్పాల్సిందే.
    అంతా బావున్నంత సేపూ ఏదైనా బానేవుంటుంది. ఆ పరిస్థితులు మారితే మనిషిలో అలజడి రేగుతుంది. అప్పటి దాకా అంతా బావున్న కుటుంబం లో అలజడి రేగింది ఇందిర వల్ల.. సీరియల్ ఏ మలుపు తిరుగుతుందో అని మరో ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం.
    సీరియల్ఆ సక్తికరంగా సాగుతుంది.

    1. 1.1

      BhuvanaChandra

      యామిని గారు మొట్టమొదట మీ స్పందన చూసి చాలా చాలా ఆనందించాను ఎంతో ఎంతో ఉత్సాహం కలిగింది మీ స్పందన చూశాక.. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మహి తల్లిదండ్రులు ఏదో సమస్య లో ఉన్నారని కొంతకాలం నుండి అనుకుంటున్నదే. కానీ ఇలా “ఇందిర” అనే చిత్రమైన వ్యక్తి వల్ల అన్నది అసలు ఊహించలేదు. నిజజీవితంలో ఇందిరా లాంటి వారుంటారాని ఆశ్చర్యం గా ఉంది. తమ ఇంట్లో ఉన్న గౌతమ్ ని డబ్బు అహంకారం తో తల్లిదండ్రులతో పాటు తనూ చిన్న చూపు చూసింది. ఎంత అందం ఉంటే మాత్రం ఏమి? విపరీతమైన అహంకారం అన్నిటినీ మింగేసింది. తనకంటే అందంలో ఏమాత్రం సరిపోని అహల్యను అతను పెళ్లి చేసుకునే సరికి తన అహం మీద దెబ్బ తీసినట్టు ఫీలయింది. “లోతుగా ప్రేమించడం”, ఇప్పుడు “ఆదరించమనడం” ఏమిటో! ఇలాంటి ఆడవారు తాము సుఖపడరు. ఎదుటవారిని సుఖపడనివ్వరు. జీవితాలను చిందరవందర చేస్తారు. ఇప్పుడు ఈవిడ కోరిక ఏమిటి?
    నిజానికి ఈ ఇందిర పాత్ర ఒక షాక్ ఇచ్చింది. ఉంటారా ఇలాంటివారు?
    ఎంత నెమ్మది స్వభావి అయినా గౌతమ్ ఇలాంటి విషయాల్లో ఖరాఖండిగా ఉండాలి. ఈ గందరగోళం లో, ఈ వయసులో అహల్య మనసు ఎంత అల్లకల్లోలం అవుతోందో!
    ఈ “వో” ప్రవేశం వల్ల “పతీ పత్నీ” ల మధ్య అగాధం ఏర్పడడం బాధాకరం.

    1. 2.1

      BhuvanaChandra

      సుశీల గారు మీ స్పందన కోసం వారం వారం ఎదురు చూస్తుంటాను అని మీకు తెలుసా చాలా చక్కని విశ్లేషణతో మీ స్పందన తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు థాంక్యూ సో మచ్

  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. జీవితం లో ఎప్పుడు ఏ సమస్య ఎలాగయినా ఒయస్సు తో నిమిత్తం లేదు. ప్రేమగుడ్డిది అంటారు. ఇందిరా ప్రేమ చూసాక అది నిజం అనిపించింది. గౌతమ్ కుటుంబం గురించి ఆలోచన లేదు. ఆ పట్టు విడుపు సమన్వయం మనసుకు లేకే ఇన్ని సమస్యలు. ప్రతి వాళ్ళు జీవితం లో నేర్చుకోవలసిన పాఠాలు, ఇంగితాలు పిల్లలకు నేర్పావలసినవి బాగా వ్రాసారు. మధ్య మధ్యలో మీ వంటలు వార్పులు నోరు ఊరిస్తూ వున్నాయి. జీవితం అంటే అన్నీ కలబోతే కదా కష్టం వచ్చింది అని తినటం తొంగోవటం మానం కదా.రాత్రికి నిద్రపుచ్చి పొద్దుటే భుజాన వేసుకుంటాము. 😄 ధన్యవాదములు -రోహిణి 🙏💐

    1. 3.1

      BhuvanaChandra

      రోహిణి గారు నమస్కారం. మీరు సీరియల్ ని అన్ని విధాలుగా అన్ని కోణాలతో పరిశీలించి తెలిపిన మీ స్పందన నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: * నమస్తే భువన చంద్ర గారూ. మీ ధారావాహిక ప్రారంభం నుండీ చదువుతున్న నాకు దినచర్యలో ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉండటం అలవాటయింది. ఈ అలవాటు అనేది మంచిదైనా చెడ్డదైనా మన మైండ్‍ని మనది ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మమేకం అవటమే కారణమవుతుందేమో. ఈరోజు చదువుతుంటే మీరు పాత్రల చుట్టూ సమస్య సృష్టించి దాని పర్యవసానం వివరించి, మంచి చెడు కలయికతో మంచి ఆలోచన సంస్కారం తో పరిష్కారం చూపించి మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉన్నది. అదే నిమిషాలు జీవితం పట్ల సరైన అవగాహన కలిగిస్తున్నారు.
    మీ రచనా ప్రక్రియ మనసుకి హత్తుకునేలా ఉంది. ధన్యవాధాలు.
    మహి పాత్రలో ఇంతవరకు నిస్పృహ, నిస్సత్తువ కనిపించలేదు. పెద్దవాళ్ళ సమస్యలు పిల్లలకు తెలిసి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉంటారు. ఈ రోజు మూడు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ అనిపించింది. ఆనందంగా ఉండే ఓ మంచి సంస్కారం గల కుటుంబంలో ఓ తుఫాన్ అలజడి సృష్టించి మమ్మలని
    ఆతృత ఆరాటంలో పెట్టారు. నిజానికి ఈనాడు కారణాలు అనేకం ఉన్నా ఇలాంటి సమస్యలు చాలా ఉంటున్నాయి.
    మీరిచ్చే పరిష్కారం ఎంతోమందికి పనికొస్తుంది అనుకుంటున్నాను. ప్రతి చిన్న విషయాన్ని చాలా విశ్లేషించి మా ముందు ఉంచుతుంది మీ రచన (ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నప్పటి సమస్య). ఎవరికి వారు ఎక్కువగా ఆలోచన చేసి తెలుసుకోవాలి.
    మీరు చెప్పినట్లు పిల్లలకి చిన్నచిన్నప్పటి నుంచీ నేర్పాలి. నిజం చెప్పాలంటే.
    చాలా బాగుంది అభివందనాలు. చాలా సహజంగా తీర్చిదిద్ది వ్రాసిన రచనా తీరు అద్భుతం. అపూర్వమైన అందమైన సృష్టి. చాలా సంతోషం.*

  5. 5

    Sobharaja

    🙏
    ఇందిర ద్వారా ఆడవారి అసూయ, ఈర్ష్య ద్వేషాలు సాటి ఆడదాన్నే కాకుండా మగ వారిని అడకత్తెరలో పోక చెక్కలా ఎలా ఇబ్బంది పెడతాయో అర్థమౌతోంది. అనాదిగా శూర్పణఖ మంథరలు ఎలా ఇబ్బందులు పెట్టి నామ రూపాలు లేకుండా పోయారో అటువంటి దుఃస్థితి ఇందిరకు కలగాలి. మగవాడు మెతక గా ఉన్నంత కాలం ఆడవారు అణగద్రొక్కుతూనే ఉంటారు.
    మరీ ఈ కలియుగంలో సీత సావిత్రుల్లాంటి వాళ్ళు అరుదు.
    మీ నవల ఆకర్షణీయమైన మలుపులు తిరుగుతోంది.
    ధన్యవాదాలు🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!