సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి తన్‌
    మహైశ్వర్యం లీలాజనితజగతః ఖండపరశోః ।
    శ్రుతీనాం సర్వస్వం సుకృతమథ మూర్తం సుమనసాం
    సుధాసౌందర్యం తే సలిలమశివం నః శమయతు అను అద్భుతమైన గంగాలహరి శ్లోక ప్రస్తావన ఈ విభాగములో చేసారు. చాలా సంతోషం కలిగింది.
    వసుధ కెల్ల సమృద్ధ సౌభాగ్య గరిమ,
    జగ మెవని లీల యా మహేశ్వరు విభూతి,
    శ్రుతుల సారము, సుమనస్సుకృతము రూపు,
    అశివ మడఁచుత నీజల మమృతరోచి. అని రామచంద్ర కౌండిన్య గారు ఈ శ్లోకానికి అనువాదం చేసారు. ”
    పండితరాజునకు నూఱు, నూటయేఁబది యేండ్ల తరువాతి వాఁడును, గంగాలహరీ వ్యాఖ్యాతలలో నొక్కఁడునగు సదాశివుఁడను పండితుఁడు తన వ్యాఖ్య యందు “అత్ర ఇదం శ్రూయతే. కవి జగన్నాథో ఢిల్లీవల్లభాశ్రిత స్తద్యవనీ సంసర్గదోషభాక్‌ స\న్‌, గంగా సకాశాత్‌, ద్విపంచాశత్సోపానాంతరిత నిజగృహే వసన్‌, తత్రైవ జాహ్నవ్యాగమనస్పర్శేన ఆత్మశుద్ధిం కామయమాన స్స\న్‌ … ప్రార్థయతే …” (కవి జగన్నాథుఁడు ఢిల్లీవల్లభున కాశ్రితుఁడై, యవన కాంతా సంసర్గమున దోషియై, (కాశికివచ్చి) గంగ మొదలుకొని యేఁబది రెండు మెట్ల పైనున్న తన యింట నుండిన వాఁడై, గంగ వచ్చి స్పృశించినచో నాత్మశుద్ధి యగునని కోరుకున్న వాడై …) యని వ్రాసినాడు. పండితరాజునకు సన్నిహితకాలము వాఁడే యా గాథను నమ్మి వ్రాయఁగా నీనాఁటి వారు వానిని నమ్మి రనుటలో వింతయేమున్నది?. అని శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి ఈ పుస్తకపు పీఠికలో వ్రాసారు. జగన్నాథపండితుని వలెనే ‘పండితరాజ’ బిరుద మొందిన వారు పెక్కురు గలరనియు, వారిలో “లోలంబరాజు, దయావీరశర్మ” మున్నగు వారు యవనస్త్రీలను బెండ్లాడి రనియుఁ దెలియవచ్చు చున్నది. యవన కాంతాసంబంధి పద్యములా ‘పండితరాజు’లవి కావచ్చును. అని కూడా వారు వ్రాసారు. ఈ వాక్యాలు జగన్నాథుని శీల సంరక్షణ చేసిన మీ కథాగమనానికి అనుగుణంగా ఉన్నాయి. మొత్తానికి ఈ భాగం మీరు వ్రాసినట్లే “వైశ్రవణ లక్ష్మి. “అద్భుతమైన మీ రచనా సరస్వతికి నమస్సులు. 🙏
    ఆచార్య పతంజలి

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    నమస్సుమాంజలులు విహారి బాబాయి గారు! శుభాభినందనలు. చాలా ఆనందం వేసింది గంగాలహరి దర్శనంతో. అలాగే మిగత అ లహరీ చతుష్కము సందర్భానుసారంగా దర్శింప జేయ ప్రార్థన. యమునా స్నానములో శివ కేశవ దర్శనము, ఆదిత్య వైభవంలో సుధ, కరుణాలహరిలో ఆత్మనువేదన, లక్ష్మీలహరిలో మరపురాని సుమధురభావకదంబం రుచి మచ్చునకు చూపండి. ఆయన జగన్నాథుడే దిగి సత్యనారాయణలో కనిపిస్తున్నాడు. తవ పాదారవిందాభ్యామ్ నమోఽస్తు. అపూర్వ అపురూప అప్రమేయ ప్రతిభా సంపన్న జగన్నాథ దర్శనం ” పండా” వైభవం ఎపుడు సంపూర్ణంగా దర్శిస్తామా! అని మనసు ఉవ్విళ్ళూరుతోంది.‌మీరు, జగన్నాథ పండితులు అమరులు.👣🙏
    ఆర్. మురళీధర రావు

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    విహారి గారికి
    నమస్సుమాంజలులు!
    ఈ భాగాన్ని చదివాక అమందానందకందళిత హృదయారవిందుడనైనాను. హార్దికాభినందనలు. ఇంత చక్కటి రచననందిస్తున్నందుకు ధన్యవాదములు.
    వరిగొండ కాంతారావు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!