సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    RamV

    Excellent end to a never-ending story of a fulfilled person’s life. Thank you!

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    శర్మ గారు.. సాఫల్యం చివరి భాగం ఇప్పుడే చదివాను. ఎందుకో చదవడం మొదలు పెట్టినప్పటినుంది ఆలోచనతో కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి. ఇప్పటికీ ఆగడం లేదు. ఎందుకో తెలీదు. ఏదో నా కూతురు పెళ్లి చేసుకొని మమ్మల్ని విడిచి పోతున్నట్టు.. రకరకాల ఆలోచనలు. ఉద్విగ్న స్థితి. మరి వచ్చే ఆదివారం.. ఇదొక ఆలోచన.. సాఫల్యం నిజంగా “సఫల”మైందని భావిస్తున్నా. కృతజ్ఞతలు
    శ్రీ నిరంజన్ దేశాయ్, సామాజిక సేవకులు, హైదరాబాద్

    1. 2.1

      ప్రసన్న

      చాలా బావుందండీ. చరమదశ లో ఎదుర్కునే ఏం సాధించాం అనే ప్రశ్న ని చక్కగా విశ్లేషించారు. ఈ వారం నుంచి దీన్ని miss అవుతాం. ఇంకా వ్రాస్తూ ఉండండి దయచేసి

  3. 3

    S T Apartments

    చక్కని ముగింపు. మీతో పాటు మేమూ ‘సాఫల్యం’ పొందినాము.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    కర్నూలు పట్నంలో తిప్పి వెల్దుర్తి లో తిరిగి, కాకినాడ, దాకా కూడా ప్రయాణం చేసి, ఎందరెందరో పరిచయం అవుతూ కలుస్తూ కనపడుతూ, పతంజలి తోతిరుగుడు సమాప్తం అంటే కాసేపు శూన్యంగా అనిపించినా జీవన సాఫల్యానికి మనకు దగ్గరైన అర్థం తెలిపి కవిగారి కలము వెలుగురేఖలను విస్తరించింది. 🙏🏻🙏🏻🙏🏻👍💚❤️💙
    శ్రీమతి సుబ్బలక్ష్మి గారు, టీచర్, కర్నూలు

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    చక్కని ముగింపు. మీతోపాటు మేమూ ‘సాఫల్యం’ పొందాము. 👌🙏
    శ్రీ డి. వి. ఎస్. కె. మూర్తి గారు, తెనాలి

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    అహోబిల నరసింహ స్వామి, దత్తాత్రేయ స్వామి ఆశీస్సుల వల్ల “సాఫల్యం” నవల పుస్తక ముద్రణ, పాఠకులకు అందటం విజయవంతం అవుతుందని నా గట్టి నమ్మకం.
    శ్రీ నిరంజన్ దేశాయ్, హైదరాబాద్

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    సాఫల్యం సూపర్, అయ్యో అపుడే అయిపోయిందా అనిపించింది, పతంజలి పాత్ర చిత్రణ అనన్యం, అమోఘం, అపూర్వం, ప్రతి మనిషికి జీవితంలో ఇలాంటి స్థితి వస్తుందీ అనుకుంటాను, ఎన్ని పాత్రలు, అందరి స్వభావాలు చాలాబాగా వివరించారు, మధ్యతరగతి కుటుంబం ఆర్థి కంగా ఎదిగి అంచ లంచలుగా ప్రగతి సాధించింది, మీకూ అభినందనలు తెలియజేస్తున్నాను.
    శ్రీమతి అవధానం లక్ష్మీ దేవమ్మ, రచయిత్రి, యూ. ఎస్.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    సాఫల్యం ఒక మానవుని జీవనయానం.
    పాఠశాల మెట్లు మాత్రమే ఎక్కిన బాలుడు తదనంతరపు చదువునంత స్వయంగా చదివి ఇంగ్లీషు ఎం ఏ ఉత్తీర్ణుడు కావడం చూస్తే..
    కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు…మహాపురుషులౌతారు…అన్న సినిమా పాటను గుర్తు చేస్తుంది.కుటుంబ భారాన్ని తండ్రితో బాటు పంచుకుంటూ తన చదువు సాగించడం విశేషం.యువతరానికి ఒక పాఠం వంటిది.
    వ్యవసాయము,పట్టుపురుగుల పెంపకం మొదలైన అవకాశాలనన్నీ వినియోగించుకున్నాడు నవలానాయకుడు.ఇదీ యువత గమనించవలసిన విషయమే. తోడబుట్టిన వారిగురించి శ్రద్ధ చూపడం భారతీయ కుటుంబ వ్వస్థలోని గొప్పదనాన్ని అనుబంధాన్నీ చాటుతుంది. ట్యుటోరియల్స్ నడిపి,తన స్నేహితులకూ జీవనోపాధి చూపడం ఒక సామాజిక అవసరాన్ని చాటింది.ఒకరి కొకరు తోడుగా ఉంటే జీవనసోపానాల నధిరోహించడం సులువు అవుతుందని చాటుతూంది.అంత ప్రస్థానంలోనూ తనకి సాయపడిన ఏవ్యక్తినీ మరచిపోలేదు.
    కుటుంబ వ్యవహారాల్లో శ్రీమతికి తోడుపడడం మగవాళ్లు నేర్చుకోవలసిన విషయం.
    ఉద్యోగనిర్వహణలో డాంబికం చూపకుండా,ఎవరితో ఎలావ్యవహరించాలో కూడా నాయకుడు తన ప్రవర్తన ద్వారా చాటినాడు.రాష్ట్రస్థాయి ఉద్యోగిగా అవినీతి సంపాదనకు ఆస్కారం ఉన్నా నిజాయితీగా ప్రలోభాలకు లొంగకుండా నిలబడడం ప్రతి ఉద్యోగి నేర్చుకోవలసిన గుణం.
    ఉద్యోగ విరమణతర్వాత కనబడిన ఒక మంచిలక్షణం యింకా సంపాదనకు ఎగబడకపోవడం సమాజానికి చేతనైన సహాయం చేయాలనే తపన ఉండడం సర్వులూ పాటించవలసిన గుణం.
    తను సాధించిన దేమిటి?తనవల్ల సంఘానికి కలిగిన ప్రయోజన మేమిటి అని నవలానాయకునిలో ఉదయించిన ప్రశ్నలు ప్రతిమానవుడూ తనను ప్రశ్నించుకొని తీరవలసినవి.
    చివర్లో కృత్తివాస్ ముఖర్జీ వేసిన ప్రశ్నలు ప్రతివ్యక్తీ తరచు వేసుకుంటూ ఉండవలసిన ప్రశ్నలు.పాజిటివ్ గా సమాధానాలు వస్తే ఆవ్యక్తి సంపూర్ణమానవుడు అనిపించుకోవడానికి అర్హుడు.
    సాఫల్యం నవలను నవలగా కాక ఒక వ్యక్తిత్వవికాస పాఠ్యపుస్తకంగా చూడవలసినది.
    మానవ జన్మ సాఫల్యం చెందడానికి తగిన,కావలసిన సామాగ్రి అంతా సాఫల్యం నవలలో దొరుకుతుంది.
    ఆ సామాగ్రి సరళంగా అందించడంలో పాణ్యం దత్తశర్మ సంపూర్ణంగా సఫలుడైనాడు.
    శ్రీ కోడూరు శేషఫణి శర్మ, రచయిత, కవి, విమర్శకులు, గుంటూరు

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    కృత్తివాస్ ముఖర్జీ ఆఖరున అనిన మాటలు-“నీ విచారం నిర్హేతుకం..” మన వయసు వారికి, పతంజలి లాగా ఏకాత్మకాలోచనల తో సతమతమయ్యే వారికి ప్రబోధాత్మకంగా ఉన్నాయి. మనవరాలికి ‘సాఫల్య” అనే పేరు పెట్టాలనుకోవడం యుక్తి యుక్తంగా ఉండటమే కాక నవలకు సంపూర్ణతను, సాఫల్యత ను ఇచ్చిందని భావిస్తున్నాను.
    గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి గారు, రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్,ఆధ్యాత్మిక రచయిత, అనంత పురం

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఈరోజు ఆఖరి భాగం సాఫల్యం చదివాను మంచి ముగింపు. ఆ పుస్తకం నాకు కావాలి. తప్పకుండ పంపగలరు 🙏🙏🙏🙏
    ఇలా ఇంకా మీరు మంచి రచన లు చెయ్యాలి మీకు అభినందనలు నమస్సులు 🙏🙏👌👌
    ఓ అద్భుతం అయిన నవల సాహిత్య అకాడమీ వారు తప్పకుండ బహుమతి ఇస్తారు పోటీ కి పంపితే. రచయిత శర్మ గారికి అభినందనలు. సంచిక సంపాదక వర్గానికి నమస్సులు 🙏🙏🙏
    శ్రీ కాశీ విశ్వనాధ్, రాజమండ్రి

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    అనర్గళంగా సాగిన ధారావాహిక చక్కటి ముగింపు సాధించింది సాఫల్యం అంటే ఏమిటి అనేదానికి చక్కటి నిర్వచనంతో నవల ముగించడం చాలా ఆర్ద్రత భావానికి లోను చేసింది సర్వత్ర సమదర్శనః
    శ్రీ కె. ఎస్. ఆర్ శాస్త్రి గారు, రిటైర్డ్ డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్, బెంగుళూరు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!