అప్పుడప్పుడు కొన్ని అనుకోనివి జరిగిపోతుంటాయి. కొన్ని మంచివి మరికొన్ని జరగకూడనివీను. జరిగిన పని ఎలాంటిదైనా జీవితంలో అవి నాటుకుపోతాయి. కొన్ని విషయాల్లో అది చరిత్ర అవుతుంది. కొన్ని సంఘటనలు మరిచిపోవాలనుకున్నవి కూడా మరచిపోలేక, జీవితాంతమూ మన వెంట నడుస్తూ, మన మనస్సును గుచ్చుతుంటాయి. అవి ఆనంద పడవలసిన విషయం కావచ్చు, బాధపడవలసిన అంశమూ కావచ్చు. మన ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు లేదా పనులు మన చేతుల మీదుగా జరిగిపోతుంటాయి. ఎక్కువశాతం అవి మంచి పనులు అయి ఉంటాయి. ఆ పనులు యాదృచ్ఛికంగా మనకు మనమే చేయవచ్చు లేదా మనల్ని బాగా నమ్మినవారు మనకు ఆ పని అప్పగించి ఉండవచ్చు. ఏది ఏమైనా అవి మనం ఎప్పుడూ ఊహించని పనులు. అవి మన చేతుల మీదుగా జరుగుతాయని ఎన్నడూ అనుకోని పనులు.
కొందరు చిన్నతనంలో చదువులో చాలా వెనుకబడి వుంటారు, కానీ ఎదిగిన కొద్దీ వారిలో మార్పు వచ్చి ఊహించని ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అలాగే ఒక పేద కుటుంబం నేపథ్యంగా గల పిల్లలు ఉన్నతస్థాయి ఉద్యోగులు కావచ్చు. ఒక వికలాంగుడైన సాధారణ పౌరుడు ఎవరూ చేయలేని పరిశోధనలు చేసి పేరు తెచ్చుకోవచ్చు.
తమ విద్యాభ్యాసంలో అంతగా ప్రాధాన్యం లేని తెలుగును ఒక పాఠ్యాంశంగా మాత్రమే చదువుకున్నవాళ్ళు తెలుగు సాహిత్యంలో ఉద్దండులైన సాహిత్యకారులు కావచ్చు, అవధానులు కావచ్చు. ఇలాఎన్నో ఎన్నెన్నో మనం ఊహించని కొన్ని పనులు మనం చేసే పరిస్థితి ఏర్పడి మనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆంగ్ల భాషలో ఉద్దండులైన వారు తెలుగులో మంచి కవిత్వం రాయవచ్చు. గణిత శాస్త్రంలో ప్రవీణులైనవారు, తెలుగులో మంచి కవిత్వం చెప్పవచ్చు, లేదా అవధానాలు చేయవచ్చు, మంచి సాహిత్య విమర్శకులు కావచ్చు. ఇవన్నీ ముందుగా ఎవరూ వూహించనివే మరి! ఈ ఉపోద్ఘాతమంతా నా జీవితంలో నేను ఊహించని విధంగా నేను చేసిన కొన్ని పనుల గురించే, వాటిని ఒకమారు సింహావలోకనం చేసుకోవడమే!
1975లో, ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా వున్న ‘డెంటల్ వింగ్’లో దంతవైద్య విద్యార్థిగా అడ్మిషన్ పొందాను. ఉస్మానియా వైద్య కళాశాల కోఠీలో వుంటే, డెంటల్ వింగ్, అఫ్జల్‌గంజ్‌లో ఉండేది. అప్పటికి అది దంతవైద్య కళాశాల కాలేదు. ప్రొఫెసర్ తజమ్మల్ హుస్సేన్ గారు (ఓరల్ సర్జరీ) విభాగ అధిపతిగా ఉండేవారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత, దంతవైద్య విభాగ అధిపతిగా ప్రొఫెసర్ శేషాద్రి గారు (ఆర్థోడాన్షియా) నియమితులైనారు. వీరి హయాములో ప్రత్యేక దంతవైద్య కళాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం అయినాయి. వైద్యరంగం లోనూ, రాజకీయ రంగంలోనూ డా. శేషాద్రి గారికి పలుకుబడి ఉండడం చేత ఆయన ప్రయత్నాలు త్వరితగతిన ఫలితాలు సాధించాయి. తద్వారా ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా వున్న డెంటల్ వింగ్ కాస్తా ప్రభుత్వ దంతవైద్య కళాశాల (1978-79)గా రూపు దిద్దుకుంది.
మధ్యలో సూట్లో వున్నది అప్పటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శేషాద్రి గారు
ఆ విధంగా అఫ్జల్‌గంజ్‌లోని మొదటి ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు (అప్పటికి, విజయవాడలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలగానీ, ప్రైవేట్ రంగంలో దంతవైద్య కళాశాలలు గానీ లేవు) మొదటి ప్రిన్సిపాల్‌గా నియమింపబడి, రికార్డులకెక్కారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు ‘లోగో’ కావలసి వచ్చింది. ఆఫీసువాళ్ళు ఆ పని చేయగలరు. కానీ ప్రిన్సిపాల్ గారి ప్రత్యేక పర్యవేక్షణ లో ‘లోగో’ తయారు అయింది.
అది ఎలా జరిగిందంటే – నేను మా బి.డి.ఎస్. క్లాసులో పెద్ద తెలివైన వాడిని ఏమీ కాదు. ఏవరేజ్ స్థాయిలో ఉండేవాడిని. లీడర్షిప్ లక్షణాలు కూడా ఉండేవి కాదు. స్నేహానికి ఆడ – మగ అన్న తేడా లేకుండా ముందుండేవాడిని. అప్పటికే పత్రికల్లో చిన్న చిన్న వ్యాసాలు రాస్తూండేవాడిని. గురువులపట్ల వినయ విధేయతలతో మెలిగే వాడిని. గురువులు చాలా మట్టుకు నన్ను ఇష్టపడేవారు. అందులో ప్రొఫెసర్ శేషాద్రిగారు కూడా ఒకరు. ఒక రోజున ఆశ్చర్యకరంగా శేషాద్రిగారు నన్ను ఆయన ఆఫీసుకు రమ్మని కబురు పెట్టారు. నిజానికి ఆయనంటే అందరికి హడల్! ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారు. అందులో నేనూ ఒకడిని. ఇలాంటి పరిస్థితిలో భయపడుతూనే ఆయన ఛాంబర్లో ప్రవేశించాను. అదేమిటోగానీ వింతగా, ఎప్పుడూ సీరియస్‌గా వుండే ప్రిన్సిపాల్ గారు, నన్ను చూసి నవుతూ “రావయ్యా.. రా.. రా.. నీకోసమే ఎదురు చూస్తున్నా” అన్నారు. నాకు మాటలు రాక ఆయన ఎదురుగుండా అలానే నిశ్శబ్దం పాటిస్తూ నిలబడిపోయాను. అప్పుడు ఆయన, నాలుగైదు ఇతర రాష్ట్రాల దంతవైద్య కళాశాలల సావెనీర్లు నా ముందుంచి, “వీటిని ఆధారం చేసుకుని మన దంతవైద్య కళాశాల కోసం ఒక ‘లోగో’ చేయించాలి నువ్వు” అన్నారు. ఆయన మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి, నా మీద ఏమిటి ఈయనకు ఇంత నమ్మకం.. అనుకున్నాను. కొద్ది క్షణాలలోనే నా మదిలో ఒక అద్భుతమైన చిత్రకారుడు మెదిలి, ఆ దైర్యం తోనే ఆయన ముఖంలోకి చూసి “అలాగే.. సార్” అని, ఆయన ఇచ్చిన సావెనీర్లు తీసుకుని బయట పడ్డాను.
లోగో విషయం చెప్పగానే నా మదిలో మెదిలిన ప్రసిద్ధ చిత్రకారులు.. కీ.శే. శీలా వీర్రాజు గారు (వీర్రాజు గారు జూన్ 1, 2022న హైదరాబాదులో స్వర్గస్తులైనారు). శీలా వీర్రాజు గారు, మా కుటుంబ స్నేహితులు. పెద్దన్నయ్య కె.కె. మీనన్‌కు అత్యంత ఆప్తులు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వీరు కేవలం చిత్రకళ లోనే కాక, నవల, కథ, కవిత్వంలో దిట్ట. అనేకమంది వర్ధమాన రచయితలు, సీనియర్ రచయితల పుస్తకాలకు ముఖ చిత్రాలు వేసిపెట్టిన మహానుభావుడు, శ్రీ వీర్రాజు గారు. ఆయన రాసిన ‘మైనా’ నవల నాటి ఉమ్మడి రాష్ట్ర (ఆం.ప్ర. సాహిత్య అకాడమి) అవార్డు పొందింది. ఆయన ఎందరో కవులను రచయితలనూ ప్రోత్సహించారు. ఇలాంటి నేపథ్యంగల వీర్రాజు గారి దగ్గరకు (అప్పట్లో మలకపేటలో వుండేవారు) వెళ్లి నా సమస్య వివరించాను. ఆయన సంతోషంగా నా మాటలు విని తప్పక ఆ పని చేసి పెడతానని నాకు దైర్యం చెప్పి నా దగ్గర వున్న సావెనీర్లు తీసుకున్నారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనివల్ల నాకు మంచి పేరు రావడమే కాదు, వీర్రాజుగారి పేరు అక్కడ చిరస్థాయిగా నిలిచిపోతుందని భావించి నాకు ఎక్కడలేని ఉత్సాహం ఒళ్లంతా అల్లుకుంది.
చిత్రకారులు,సాహిత్యకారులు శ్రీ శీలా వీర్రాజు గారు (హైదరాబాద్)
సరిగ్గా వారం రోజులకనుకుంటాను నలుపు – తెలుపు రంగుల్లో, మా దంతవైద్య కళాశాల లోగో వీర్రాజు గారి చేతిలో రూపు దిద్దుకుంది. తక్షణం అది నా చేతికందింది. అప్పట్లో శ్రీ వీరాజీ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ఆంధ్ర పత్రిక వారపత్రికలో మా దంత వైద్య కళాశాలను గురించి రాస్తూ ఈ ‘లోగో’ విషయం కూడా ప్రస్తావించాను. దురదృష్టవశాత్తు ఆ వ్యాసం సమయానికి ఇప్పుడు అందుబాటులో లేదు.
వీర్రాజు గారు గీసిన ఒరిజినల్ లోగో
కష్టపడి లోగో తయారు చేసిన వీర్రాజు గారు దానికి వెల కట్టలేదు. యెంత బ్రతిమాలినా ఆయన నా దగ్గర డబ్బులు తీసుకోలేదు. అది ప్రభుత్వపరమైన అధికారిక పని అని, దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ ఉందన్న మా ప్రిన్సిపాల్ గారి మాట చెప్పినా ఆయన డబ్బు తీసుకోవడానికి అంగీకరించలేదు. ఆయన సహృదయతకు కొన్ని వేల వందనాలు. ఈ రోజున ఆయన లేకపోయినా ఆయన తయారుచేసి ఇచ్చిన అందమైన లోగో కాలేజీ వున్నంతకాలం వీర్రాజుగారిని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ రకంగా ఆయన చిరంజీవి.
ఊహించని రీతిలో కొద్ది రోజుల క్రితం (01-06-2022) శీలా వీర్రాజు గారు స్వర్గస్తులైనారు. ఆయన ఋణం తీర్చుకోవడానికి కనీసం ఈ వ్యాసంలో ఆయనకు చోటు కల్పించాలని నాకు అనిపించింది. ఈ నేపథ్యంలో ఎప్పుడో, 1979లో ఆయన గీసిన లోగో ఇప్పుడు సంపాదించడం ఎలా?
Prof.N S Yadav. MDS (Madhya Pradesh)
కాలేజీ బోర్డుమీదనో లెటర్‌హెడ్ మీదనో వున్న లోగో సేకరించాలని అనుకున్నాను. అదృష్టవశాత్తు, ప్రస్తుతం ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్, మా గురువు డా.ఎన్.ఎస్. యాదవ్ గారి అన్న కుమారుడు, ప్రొఫెసర్ సర్జీవ్ సింగ్ యాదవ్ ఎంతగానో సహకరించి ఒరిజినల్ లోగో చిత్రం పంపించారు. వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
Prof. Sarjeev Singh Yadav, Prof.&HOD,Department of Operative Dentistry & Endodontics
దంతవైద్య కళాశాల ప్రారంభం గురించి మా గురువులు ప్రొఫెసర్ ఎన్. ఎస్. యాదవ్ గారు(మధ్య ప్రదేశ్) నా సహాధ్యాయి ప్రొఫెసర్ హరనాథ్ బాబు (హైదరాబాద్) రూఢిగా నిర్ధారించి సహకరించారు. వారిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రొఫెసర్ హరనాథ్ తో రచయిత
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రూపు దాల్చిన లోగో….
ప్రేమమూర్తి,శీలా వీర్రాజు గారికి పాదాభివందనం.
అవును ‘ఆ.. లోగో.. ఆయన సృష్టే!!’
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు. —-డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ జిల్లా.
మంచి విశేషాలతో సాగుతోంది
ధన్యవాదాలండీ.
సాధారణ ప్రజలకు తెలియని గొప్ప విషయం తెలియజేసారు. ధన్యవాదాలండీ డాక్టర్ గారు!
కృతజ్ఞతలు మేడం మీకు.
శీలా వీర్రాజు గారి ప్రతిభ మాలాంటి సాహితీ అభిమానులకు అందించినందుకు ధన్యవాదములు సర్. అలాగే కళాశాల రోజుల్లో మీకు అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు శుభాకాంక్షలు.
స్వర్గీయ శీలా వీర్రాజు గారి చిత్రకళా గొప్పతనాన్ని..తెలియజేశారు.. ధన్యవాదాలు డాక్టర్ గారూ!
Great recollection. Thank you Dr KLVP —-Prof.N S YADAV LUCKNOW.
Thank you sir
Prasad Garu! Goppavaaritho parichayaalu jeevitha baatalo paathaalu. Dhanyavaadaalandi 🙏
ధన్యోస్మి.
మీరు ఎన్నో విశేషాలు మాకు తెలియచేశారు. చాలా గొప్ప వారితో కలిసి పని చేసిన అనుభవాలు చక్కగా వివరించారు. రచయిత గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.👌👍
జ్ఞాపకాల పందిరి 114 లో శీలా వీర్రాజు గారి గురించి రాయడం సందర్భోచితంగా ఉంది. ఆ మహానుభావుడితో మీకున్న అనుబంధం, వారు సృష్టించిన లోగో వృత్తాంతం తెలిపారు. అభినందనలు. —జే.శ్రీనివాసాచారి కాజీపేట.
చారి గారూ కృతజ్ఞతలు మీకు.
జ్ఞాపకాల పందిరి 114 లో చిత్ర కారులు మరియు సాహిత్యకారులైనటువంటి శ్రీ శీలా వీర్రాజు గారి చిత్ర కళా గొప్పతనాన్ని వారు సృష్టించిన లోగో విషయం,అట్లాగే ప్రొఫెసర్స్ అయిన ఎన్ యెస్ యాదవ్ గారు, సంజీవ్ సింగ్ యాదవ్ గారు,హరనాథ్ గారి పరిచయాలు బాగున్నాయి. మాకు తెలియని విషయాలెన్నో జ్ఞాపకాల పందిరి ద్వారా తెలుసుకుంటున్నాము. కళాశాల రోజుల్లో (లోగో విషయం) అలాంటి అవకాశం అందిపుచుకున్న మీకు శుభాకాంక్షలు సర్. చాలా గొప్పవాళ్ళతో కల్సి పని చేసిన అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి. తెలియని విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు డాక్టర్ గారు🙏
ధన్యవాదాలండీ భుజంగ రావు గారు.
114 వ సంచిక బాగున్నది సర్. ఒకరి టాలెంట్ ఎప్పుడు ఎట్లా బయటబడుతుందో తెలియదు..PUC లో ఫెయిలైన మాస్నేహితుడు MSc nuclear scienceలో గోల్బ్ మెడలిస్ట్ ఉస్మానియాలో.. అనుకోకుండా జరిగిన లేదా యాదృ చ్ఛికంగా జరిగే సంఘటనలు జీవితాంతం మధుర క్షణాలుగా గుర్తుండి పోతవి.మీరు తయారు చేయించిన లోగో కళాశాల వున్నన్ని నాళ్ళు ఉంటది..అటువంటి అదృష్టమూ
అవకాశమూ అందరికి రాదు. —నాగిల్ల రామశాస్త్రి హన్మకొండ.
ధన్యవాదాలండీ శాస్త్రి గారు.
ఆరోజుల్లో ఎవరి కవిత్వ పుస్తకాలు చూసినా వీర్రాజుగారి బొమ్మ నే ఉండేది. అంతక్రితం మడిపడిగ బలరామాచార్యుల వారి ముఖచిత్రాలుండేవి. ——రామశాస్త్రి.ఎన్ హన్మకొండ.
గొప్ప సాహితీవేత్త ని కళాకారుణ్ణి కోల్పోయాం సర్.కానీ మీరన్నట్టు ఆయన అందరి జ్ఞాపకాల్లో చిరంజీవి.వారు సృష్టించిన లోగో అది మీ ద్వారా ఆ కళాశాలకు రావడం,అటువంటి గొప్ప వ్యక్తి మీ సన్నిహితులు కావడం గొప్ప విషయం సర్.మీ అనుభవాల్లోని గొప్ప వ్యక్తులని మాకు సందర్శింప చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. శ్రీ వీర్రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి.🙏🙏💐 —–నాగజ్యోతి శేఖర్ కాకినాడ.
అమ్మా… మీ స్పందనకు ధన్యవాదాలు .
Sir, not only a great and satisfied experience in your college time but cherishing good life time memories too. Your attitude made you in good looks of your professors. Well done sir – Rajendra Prasad
Thank you prasad garu.
డాక్టర్ కె.వి ప్రసాద్ గారు అన్నట్లుగా కొన్ని పనులు తప్పనిసరిగా మరి చేతులమీదుగానే జరిగిపోతుంటాయి ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే లేదా మనకు ఎటువంటి ఆసక్తి లేకుండా సరే అవి మన తోటి చేయబడుతూ ఉంటాయి ఆ విధమైన డెంటల్ కాలేజీ యొక్క లోగో అన్నది డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి చేతులమీదుగా కీర్తిశేషులు శీలం వీర్రాజు గారి చే చేయబడింది. ఇది ఎంతో మంచి కార్యం అని చెప్పవచ్చు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే అంతమంది విద్యార్థులు ఉండగా ఈ పనిని డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి ఎందుకు అప్పగించాల్సి వచ్చింది అంటే dr ప్రసాద్ గారి లో ఉన్న విశేష ప్రజ్ఞాపాటవాలు అప్పటికే డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి తెలిసిపోయింది అన్నమాట. కానీ ఆయనకు ఎలా తెలిసిపోయింది అన్నది మనకు తెలియదు లేదా ఈ వ్యాసంలో చెప్పబడలేదు బహుశా దీనికి జవాబుగా ఇప్పటికైనా డాక్టర్ కె.వి ప్రసాద్ గారు ఆ రహస్యాన్ని మనకు చెబుతారని ఆశిద్దాం అభినందనలతో శ్యామ్ కుమార్
ధన్యవాదాలు శ్యామ్. ఇక్కడ ప్రధానం శీలా వీర్రాజు గారి కధనం.
[Link deleted]చిత్రకారుడు, రచయిత షీలా వీరరాజు గారు రూపొందించిన డెంటల్ కాలేజ్ లోగోకి ముట్ట చెప్పవలసిన పారితోషికం వారు బ్రతికున్న కాలములో తీర్చుకో లేకపోయినా , వారందించిన సహకారాన్ని మరువకుండా, వారి మరణానంతరం అక్షర రూపంలో అందించి డాక్టర్ గారు రుణ విముక్తులయ్యారు.-114/ —–బి.రామకృష్ణా రెడ్డి అమెరికా.
You must be logged in to post a comment.
యువభారతి వారి ‘మహతి’ – పరిచయం
‘దాతా పీర్’ – కొత్త ధారావాహిక – ప్రకటన
ఆమె నీ ప్రేయసి కాదు!
ఎండమావులు-8
జీవన రమణీయం-178
అలనాటి అపురూపాలు-58
మాటే గాయం
దాతా పీర్-19
సుబ్బలక్ష్మి – స్పోకెన్ ఇంగ్లీష్
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®