77
అప్పుడే ఆంధ్రా బ్యాంకు వారు తమ సిబ్బందికి శాంక్షన్ చేసే హౌసింగ్ లోన్ లిమిట్‌ను పెంచారు. నా మటుకు నేను, ఇంతకు ముందు తీసుకున్న లోను కాక, మరో లక్షన్నర రూపాయల వరకు అప్పు తీసుకోవచ్చు. ఆ అదనంగా వచ్చే లోనుతో, మా సొంత ఇంటి పైన మొదటి అంతస్తు నిర్మించవచ్చని అంచనా వేసుకున్నాను. వెంటనే లోను శాంక్షను కొరకు దరఖాస్తు పంపాను. అప్పు మంజూరైంది. మా బంధువు రవి గారు, ఓ సివిల్ ఇంజనీర్… ప్రస్తుతం గుంటూరులో పేరు మోసిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్. వారికే మా ఇంటిపై మొదటి అంతస్తు నిర్మాణ బాధ్యతలను అప్పజెప్పాను.
మునిసిపాలిటీ వాళ్ళకు బిల్డింగు ప్లాను పంపాము. ఆ ప్లానుకు ఆమోదం లభించింది. వెంటనే పై అంతస్తు నిర్మాణం పనులు మొదలుపెట్టాము. కాంట్రాక్టర్ రవి గారు, ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం వచ్చి, రోజూ వారీ జరిగే పనులను పర్యవేక్షిస్తున్నారు. పనులు కొంచెం మందకోడి గానే సాగుతున్నాయి. అయితే, భారమంతా రవి గారి మీదనే పెట్టాము. అనుకున్న టైంకి పనులన్నీ పూర్తి చేయించి, మొదటి అంతస్తును నిర్మించి మాకివ్వగలరనే నమ్మకం మాకుంది.
78
వైద్య శాస్త్రం చదువుకుని డాక్టర్లుగా అవుతారు. ఇంజనీరింగ్ చదవుకుని ఇంజనీర్లుగా అవుతారు. లా చదువుకుని లాయర్లుగా అవుతారు. అక్కౌంట్స్ చదువుకుని ఆడిటర్లుగా అవుతారు… మరి ఏం చదువుకుని రైతులు వ్యవసాయదారులు అవుతున్నారు?? తాత, ముత్తాతల కాలం నుండి, వారు అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులను చూస్తూ, వ్యవసాయం చేయడం తప్ప…!!
అంటే, ఒక శాస్త్రీయ దృక్పథం వ్యవసాయ రంగంలో కొరవడిందని మనకర్థమవుతుంది. అందుకే, వ్యవసాయదారులకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించేందుకు, అటు ప్రభుత్వ అధికారులు, ఇటు బ్యాంకు అధికారులు… ఎంతో కొంత చేస్తున్నా… అది అరకొర మాత్రమే!
నా మటుకు నేను, ఏ ఊర్లో ఉద్యోగం చేస్తున్నా, ఏ హోదాలో ఉద్యోగం చేస్తున్నా, నా ప్రాథమిక విధుల నిర్వహణకు భంగం వాటిల్లకుండా, రైతాంగానికి, గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే ఏవో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ఒక ఆనవాయితీగా అలవర్చుకున్నాను.


ఆంధ్రా బ్యాంకు వినుకొండ బ్రాంచి ద్వారా ‘జవహర్ గ్రామ యోజన’ పథకం క్రింద, కొత్త జడ్డావారి పాలెం, కొత్త చెరువు కొమ్ముపాలెం గ్రామాల్లో అమలుపరచవలసిన ‘ఋణ ప్రణాళిక ఆవిష్కరణ సభ’. వేదికపై: ఎడమ నుండి కుడికి: ఆంధ్రా బ్యాంకు గుంటూరు రీజినల్ మేనేజర్ శ్రీ బి. టి. కాంతారావు గారు, ఋణ ప్రణాళికను ఆవిష్కరించిన ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం, హైదరాబాద్, డిప్యూటి జనరల్ మేనేజర్ శ్రీ. జి. మాలకొండారెడ్ది గారు, రచయిత, ఆంధ్రా బ్యాంకు వినుకొండ బ్రాంచి మేనేజరు గారు. ప్రసంగిస్తున్న అభ్యుదయ రైతు సోదరుడు.
ఆ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు లాం ఫారంలో, ఆధునిక వ్యవసాయ విధానాలపై నిరంతరం పరిశోధనలు జరిపే వ్యవసాయ శాస్త్రజ్ఞుల సహకారంతో, రైతులకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు అమలు చేశాము. ఒకప్పుడు వ్యవసాయ కళాశాల, బాపట్లలో నేను చదువుకునే రోజుల్లో నాకు పాఠాలు చెప్పిన కొందరు ప్రొఫెసర్లే, డాక్టర్ మొవ్వా రామారావు గారు, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ అప్పారావు గారు…. ఇంకా చాలామంది… ఇప్పుడు లాం ఫారంలో వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎనలేని సేవలు అందిస్తున్నారు. మా కార్యక్రమాలన్నింటికి వారు సహకరించారు. ఎంతైనా… శిష్యుడు కోరితే గురువులు కాదంటారా?!
79
ఆ కోవలో…
లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఆంధ్రా బ్యాంకు వైకుంఠపురం శాఖ ద్వారా వైకుంఠపురంలో ఒక రైతు శిక్షణా శిబిరం నిర్వహించాము.


ఆంధ్రా బ్యాంకు వైకుంఠపురం బ్రాంచి ద్వారా వైకుంఠపురం గ్రామంలో ‘సత్వర గ్రామీణాభివృద్ధి పథకం’ క్రింద. ఆం. ప్ర. వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం ఫారం, గుంటూరు వారి సహకారంతో నిర్వహించిన ‘రైతు శిక్షణా శిబిరం’. ఎగువన: వేదికపై ఎడమ నుండి కుడికి: ఒక అభ్యుదయ రైతు, లాం ఫారం శాస్త్రవేత్త డాక్టర్ మొవ్వా రామారావు గారు, ఆంధ్రా బ్యాంకు గుంటూరు రీజినల్ మేనేజర్ శ్రీ బి. టి. కాంతారావు గారు, వైకుంఠపురం గ్రామ సర్పంచ్ గారు, ప్రసంగిస్తున్న రచయిత. దిగువన: శిక్షణా శిబిరంలో పాల్గొన్న రైతు సోదరులు.
అలాగే, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, జంగమహేశ్వరపురంలోని, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విత్తనోత్పత్తి కేంద్రంలో, రైతు దినోత్సవం నిర్వహించాము.


జంగమహేశ్వరం గ్రామంలోని ఆం. ప్ర. వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తనోత్పత్తి కేంద్రంలో నిర్వహించిన ‘రైతు దినోత్సవం’. ఎగువన: పాల్గొన్న అతిథులు మరియు రైతు సోదరులు. దిగువన: వేదిక పైన ఎడమ నుండి కుడికి: ఆంధ్రా బ్యాంకు గుంటూరు రీజినల్ మేనేజర్ శ్రీ బి. టి. కాంతారావు గారు, ఆం. ప్ర. రాష్ట్ర వ్యవసాయ శాఖ, గుంటూరు ఉన్నతాధికారి, ఆం. ప్ర. వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం ఫారం శాస్త్రవేత్త డాక్టర్ మొవ్వా రామారావు గారు, ఆంధ్రా బ్యాంకు గుంటూరు జోనల్ మేనేజర్ శ్రీ వెంకటాద్రి గారు, విత్తనోత్పత్తి కేంద్ర ప్రధాన నిర్వాహకులు, ప్రసంగిస్తున్న రచయిత.
అలాగే, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఆంధ్రా బ్యాంకు, వినుకొండ శాఖ ద్వారా కొత్త జడ్డావారి పాలెం, కొత్త చెరువు కొమ్ముపాలెంలో రైతు శిక్షణా శిబిరాన్ని నిర్వహించాము.


ఆంధ్రా బ్యాంకు వినుకొండ బ్రాంచి ద్వారా ‘జవహర్ గ్రామ యోజన’ పథకం క్రింద, కొత్త జడ్డావారి పాలెం, కొత్త చెరువు కొమ్ముపాలెం గ్రామాల్లో ఆం. ప్ర. వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం ఫారం, గుంటూరు వారి సహకారంతో నిర్వహించిన ‘రైతు శిక్షణా శిబిరం’. ఎగువన: వేదికపై ఎడమ నుండి కుడికి: లాం ఫారం శాస్త్రవేత్త డాక్టర్ మొవ్వా రామారావు గారు, ప్రసంగిస్తున్న రచయిత, మరో శాస్త్రవేత్త, ఆంధ్రా బ్యాంకు వినుకొండ బ్రాంచి మేనేజర్ గారు. దిగువన: శిక్షణా శిబిరంలో పాల్గొన్న రైతు సోదరులు.
ఆ కార్యక్రమాలల్లో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో, పంటలలో అధిక దిగుబడిని సాధించి, తద్వారా అధిక రాబడిని పొందే మార్గాలను విశదీకరించారు. రైతుల సందేహాలకు తగిన రీతిలో సమాధానాలను చెప్పి, వారి అవగాహనను పెంపొందించారు.
80
గ్రామీణ పేదల ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి పరిచేందుకు, ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ – ఐ.ఆర్.డి.పి.’ అనే సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం చాలా ముఖ్యమైనది. ఆ పథకం క్రింద ప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి ఎంపిక చేసిన లబ్ధిదారులకు, బ్యాంకుల ద్వారా ఋణాలు సమకూరుస్తారు. ఆ ఋణాల్లో కొంత భాగాన్ని, ప్రభుత్వం సబ్సీడీగా ఇస్తుంది. ఆ పథకం క్రింద దారిద్ర్యరేఖకు దిగువన వుండే గ్రామీణ ప్రజలకు, షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన కులాల మరియు మైనారిటీ వర్గ లబ్ధిదారులకు, పాడి పరిశ్రమకు, కోళ్ళ పరిశ్రమకు, గొర్రెల పెంపకానికి, చేతి పనివృత్తులవారికి, చిరు వ్యాపారస్థులకు అప్పులు ఇవ్వబడతాయి. కాలక్రమేణా ఋణగ్రహీతలు వాయిదాలు సకాలంలో చెల్లించనందున బకాయిలు పేరుకుపోతున్నాయ్! వారిలో, సహేతుకమైన కారణాల వల్ల చెల్లించలేకపోయినవారు కొందరైతే, చెల్లించకపోతే ఏమవుతుందిలే… అనే సాచేతతో చెల్లించలేకపోయినవారు మరికొందరు.
లబ్ధిదారుల్లో, తీసుకున్న అప్పులు నిర్ణీత వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిన అవసరం గురించి, అవగాహన పెంచేందుకు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, చైతన్య గ్రామీణ బ్యాంకు సహకారంతో, ఆ బ్యాంకు వట్టి చెరుకూరు శాఖలో, ఐ.ఆర్.డి.పి. వర్క్‌షాప్‌ను నిర్వహించాము. ఆ వర్క్‌షాప్‌లో, ఆ మండలంలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ఐ.ఆర్.డి.పి. పథకాన్ని అమలుపరుస్తున్న డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజన్సీ – డి.ఆర్.డి.ఎ. అధికారులు కూడా హాజరయ్యారు.


జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గుంటూరు మరియు చైతన్య గ్రామీణ బ్యాంకు వట్టి చెరుకూరు బ్రాంచి సహకారంతో, వట్టి చెరుకూరు గ్రామంలో నిర్వహించిన ‘సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం’ పైన నిర్వహించిన ‘లబ్ధిదారుల వర్క్‌షాప్’ ఎగువన: వేదికపై ఎడమ నుండి కుడికి: ప్రసంగిస్తున్న రచయిత, చైతన్య గ్రామీణ బ్యాంకు, తెనాలి, ఛైర్మన్ శ్రీ సి. రాజగోపాల్ గారు, డి.ఆర్.డి.ఎ. గుంటూరు ఉన్నతాధికారి, ఆంధ్రా బ్యాంకు గుంటూరు రీజినల్ మేనేజర్ శ్రీ బి. టి. కాంతారావు గారు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. దిగువన: తీసుకున్న అప్పును నిర్ణయించిన వాయిదాల ప్రకారం సకాలంలో తిరిగి చెల్లించిన లబ్ధిదారుని సన్మానించి, ప్రోత్సహకర బహుమతిని అందిస్తున్న రచయిత, పక్కన చైతన్య గ్రామీణ బ్యాంకు, తెనాలి, ఛైర్మన్ శ్రీ సి. రాజగోపాల్ గారు.
ప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులు, లబ్ధిదారులందరికీ బ్యాంకు అప్పు తిరిగి చెల్లించాల్సిన ఆవశ్యకతని వివరించారు. అలా తిరిగి చెల్లిస్తే, మరెంతోమందికి, వారి తోటి వారికి కూడా, బ్యాంకులు అప్పులు మరింతగా ఇవ్వడానికి ముందుకొస్తాయని చెప్పారు. లేకపోతే బ్యాంకులు ఇకపై అప్పులు ఇవ్వడానికి కూడా వెనుకంజ వేస్తాయని కూడా చెప్పారు. తద్వారా గ్రామీణ ప్రజానీకం చాలా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా….
తరువాత రోజుల్లో ఆ వర్క్‌షాప్ సత్ఫలితాలను ఇచ్చిందని ఋజువైంది. అందుకే, మిగతా మండలాలలో కూడా ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించాము.
81
ఐ.ఆర్.డి.పి. పథకం క్రింద అప్పులు ఇచ్చిన తరువాత అవి వసూలు కానప్పుడు, అప్పులు తిరిగి చెల్లించాల్సిన అవసరం గురించి వివరించేందుకు, ఐ.ఆర్.డి.పి. వర్క్‌షాప్‌లు నిర్వహించాము. ఇకపై అప్పులు ఇచ్చే రోజే ఓ సభ నిర్వహించి, ఆ సభ లోనే కొంతమందికి అప్పు మంజూరు పత్రాలు ఇవ్వడం, అప్పులతో కొనుగోలు చేసిన పాడి పశువులను, గొర్రెలను, కోళ్ళను, రిక్షాలు, సైకిళ్ళు, కుట్టుమిషన్లు, ఇతర సామాగ్రి, మొదలైనవాటిని, అందరి ముందు లబ్ధిదారులకు పంపిణీ చేయతలపెట్టాము.
ఆ కార్యక్రమం అమలు చేసే దిశగా, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఆంధ్రా బ్యాంకు, తాళ్ళూరు శాఖ ద్వారా బులుసుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక సభలో, ఆంధ్రా బ్యాంకు ద్వారా అప్పులు పొందిన లబ్ధిదారులకు, పైన తెలిపిన విధంగా ఋణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాము.


‘సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం’ క్రింద ఆంధ్రా బ్యాంకు, తాళ్ళూరు బ్రాంచి సహకారంతో, బులుసుపాడు గ్రామంలో నిర్వహించిన ‘బలహీనవర్గములకు ఋణముల పంపిణీ కార్యక్రమం’. వేదికపై ఎడమ నుండి కుడికి: మూడవవారు ఆంధ్రా బ్యాంకు గుంటూరు రీజినల్ మేనేజర్ శ్రీ బి. టి. కాంతారావు గారు, ప్రసంగిస్తున్న రచయిత, ఆంధ్రా బ్యాంకు, తుళ్ళూరు బ్రాంచి మేనేజరు గారు, ఇతర ప్రభుత్వ అధికారులు.
ఆ సభ లోనే డి.ఆర్.డి.ఎ. అధికారులు, బ్యాంకు అధికారులు ఋణాలను పంపిణీ చేస్తూ, తీసుకున్న అప్పులను నిర్దేశించిన వాయిదాల ప్రకారం తిరిగి చెల్లించాలని నొక్కి వక్కాణించారు.
అలా చెల్లించడం వలన కలిగే లాభాలు, చెల్లించక పోవడం వల్ల కలిగే నష్టాలు, వాటి గురించి లబ్ధిదారులకు అర్థమయే రీతిలో వివరించారు. ఇలా పదిమంది ముందు ఋణాలు పంపిణీ చేసి, లబ్ధిదారులలో జవాబుదారీతనాన్ని పెంచగలిగాము.
ఇకపై ఋణ పంపిణీ కార్యక్రమాలను, ఇలాంటి గ్రామ సభల్లోనే చేపట్టాలని నిర్ణయించుకున్నాము.
82
రైతులకు పశువులే అండా దండా… ఆ పశువులే, పాడి పంటలకు ఆయువుపట్టు… వాటిని సంరక్షించుకునేందుకు రైతులలో వున్న అవగాహనను, మరింత పెంపొందించేందుకు గాను, ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించాము.
లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఆంధ్రా బ్యాంకు వైకుంఠపురం శాఖ ద్వారా… వైకుంఠపురంలో ఒక ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించాము.
అలాగే, ఆంధ్రా బ్యాంకు, వినుకొండ శాఖ ద్వారా కొత్త జడ్డావారి పాలెం, కొత్త చెరువు కొమ్ముపాలెం గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించాము.
ఆ శిబిరాల్లో జిల్లా పశు వైద్య శాఖ నుండి వచ్చిన వెటర్నరీ డాక్టర్లు, వారి సిబ్బంది, పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్సకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశాము.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
53 Comments
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..34th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee
SAMBASIVA RAO THOTA
Sambasiva+Rao+Thota
You are a good orator
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
Thank you very much RamanaMurthy Garu
rao_m_v@yahoo.com
Worth waiting for Sunday! May God Bless you! With all such efforts, why are farmers committing suicides?
Sambasiva+Rao+Thota
Sri MV RAO Garu!
Thank you very much for your observations and appreciation
Bhujanga rao
మీరు ఏ ఊర్లో ఉన్నా వృత్తి ధర్మానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా,గ్రామ ప్రజలు మరియు అన్ని వృత్తుల వారి అవసరాలు గమనించి వెను వెంటనే కార్యాచరణ మొదలు పెట్టడం అభినందనీయం.నిస్వార్థ సేవతో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా లీడ్బిబ్యాంక్ ఆధ్వర్యంలో ఆంధ్రా బ్యాంక్ ద్వారా ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించారు. అభినందనలు మరియు ధన్యవాదములు.
Sambasiva+Rao+Thota
BhujangaRao Garu!
Thank you very much for your observations,encouragement and appreciation
Sambasiva+Rao+Thota
Vunte pics share cheyyandi
From
Sri Shivakumar
Hyderabad
Sambasiva+Rao+Thota
Shivakumar Garu!
We have sold that house at GUNTUR in 2003 and purchased a Flat in HYDERABAD in the same year…
Photos,I will try to send..after a search in my album..
Thank you very much Andi
డా. కె.ఎల్ వి ప్రసాద్
బ్యాంక్ ల ద్వారా
రైతులకు ఎన్త బాగా సహాయపడవచ్చునోమీ అనుభవాలు చెబుతున్నాయి.
మీ కోషి అభినందనీయం.
డా. కె.ఎల్ వి ప్రసాద్
మీ కృషి అభినందనీయం
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Nice Sir
From
Sri Venkateswarlu
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Venkateswarlu Garu
Sagar
చేసే వృత్తిలో నిబద్దత ఎంత ఉందో మీ రచనలు బాగా వివరిస్తున్నాయి. మీ రచనలు అన్నీ యువకులకు ఒక జీవిత గ్రంధాలు అనేదానికి సందేహమే లేదు సర్. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
Sambasiva+Rao+Thota
Brother Sagar!
Dhanyavaadaalu
Sagar
చేసే వృత్తిలో నిబద్దత ఎంత ఉందో మీ రచనలు బాగా వివరిస్తున్నాయి. మీ రచనలు అన్నీ యువకులకు ఒక జీవిత గ్రంధాలు అనేదానికి సందేహమే లేదు సర్. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
Sambasiva+Rao+Thota
Brother Sagar!
Thank you very much for your encouragement and appreciation
Sambasiva+Rao+Thota
Your role as LB Officer is excellent sir
From
Sri SuryachandraRao
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much SuryachandraRao Garu
Sambasiva+Rao+Thota
గురువు గారు!
మీ సేవ నిరతి కొనియాడతగ్గది.



ఓరి నాయనోయ్! మీకు రైతులంటే ఉన్న మమకారం అంచనాలకు అందనిది. మీరు వాళ్లకు దేవుడు లెక్క
భగవంతుడు మిమ్మలని కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటాను
From
Sri RaviRamana
Hyderabad
Sambasiva+Rao+Thota
Ramana Prasad Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Arunakar Macha
రైతాంగానికి గ్రామీణ ప్రజలకు ఏదో చేయాలని తపన, అలుపెరుగని విధి నిర్వహణ, వారికి ఉపయోగ పడే పలు సేవా మరియు ఆర్ధిక పరమైన కార్య క్రమాలను మీ బ్యాంక్ ద్వారా మరియు వివిధ శాఖల అధిపతులను కలుపుకొని గ్రామాల్లో పలు శిబిరాలను నిర్వహించడం ఫైల్ ఫొటోస్ తో వివరించిన తీరు చాలా సూపర్ గా ఉంది. ధన్యవాదములు
అరుణాకర్ మచ్చ, మానుకోట.
Sambasiva+Rao+Thota
Dear Arunakar!
Thank you very much for your observations, encouragement and appreciation which I always cherish
Paleti Subba Rao
ఏ పదవిలో ఉన్నా వ్యవసాయదారుల్ని, వ్యవసాయ అనుబంధ కృషీవలులను మరవని వ్యవసాయ పట్టభద్రుడిగా మీరు చేసిన కృషిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. స్వీయానుభవమే రైతుల విజ్ఞానం, పరిజ్ఞానం. దానికి శాస్త్రజ్ఞుల విలువైన సలహాలు, సూచనలు తోడైతే మంచి ఫలితాలుంటాయని నమ్మబట్టే, ఎన్నో రైతు సదస్సులు నిర్వహించగలిగారు మీ గురువుగార్లతో. అందువలనన, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ గా మీరు అన్ని బ్యాంకులకు మార్గదర్శి గా, ఒక లీడర్ గా మంచి పేరు సంపాదించుకోగలిగారు.
Sambasiva+Rao+Thota
SubbaRao Garu!
Thank you very much for your observations, encouragement and appreciation..
But for your cooperation and help from you and our other colleagues in LEAD BANK Department,I would not have implemented so many SOCIAL SERVICE ACTIVITIES…,succesfully and fruitfully…
I still remember and enjoy those days with all of you…
Thank you so much SubbaRao Garu
Sambasiva+Rao+Thota
Dear Sambasiva Rao ji


The narration about chronological events
of your career in Andhra Bank is highly appreciated
and commendable
Regards
M S RAMARAO
Manager retd Central Bank
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much RamaRao Garu for your observations,encouragement and appreciation
K. Sreenivasa moorthy
Sri Thota Sambasiva Rao garu
Your efforts are very much appreciable. You are a multi talented person with a clear vision and a mission. You are really great.
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!
Thank you very much for your affectionate comments and encouragement and appreciation
Sambasiva+Rao+Thota
Gone through the episode and your journey in Andhra Bank. It’s nice. Hats off to your memory
In narrating the events so nicely.
God bless you
Seshu Mohan Panyala
Hyderabad
Sambasiva+Rao+Thota
Seshumohan Garu!
Thank you very much for your affectionate comments and encouragement and appreciation
Sambasiva+Rao+Thota
Dear Samba Siva Rao garu
Excellent service rendered to farming community through various schemes It is really Gods given opportunity to serve the farmers the backbone of the country Hearty Congratulations
Regards
R Laxman Rao
Hyderabad
Sambasiva+Rao+Thota
Lakshman Rao Garu!

Thank you very much for your affectionate comments and appreciation
Yes , really God given opportunity
Sambasiva+Rao+Thota
మీ రచనాపటిమ అత్యంత ప్రశంసనీయం. ఎప్పటి విషయాలో ఇప్పుడు జరురుగుతున్నట్లు చాలాబాగా విసదీకరిస్తున్నారు
From
Sri Ramakrishna
Kurnool and
Sambasiva+Rao+Thota
Ramakrishna Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
సాంబశివ రావు గారు, ఉద్యొగం లో వుంటూ రైతులకు మీరు తలపెట్టిన కార్యక్రమాలు మరియు వారికి కూడా ఇతరులకు చేసిన్నట్లుగా రైతులకు కూడా చేసి వారి అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహిచినదుకు, మంచిగుర్తింపు పొందినందుకు అబినందనలు
From
Sri NagaLingeswararao
Hyderabad
Sambasiva+Rao+Thota
NagaLingeswararao Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Nice Episode
From
Mr.Ramakrishna
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramakrishna
Yallamanda Rao Daggubati
సాంబశివరావు గారు,
మాది కొత్త చెరువు కొమ్ము పాలెం. మా వూరి అభివ్రుద్దిలొ అంధ్రా బాంకు పాత్ర చాల వుంది.
Sambasiva+Rao+Thota
Yellamanda Rao Garu!
Meenundi vachina spandana nannu mugdhudni chesindi…
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Recollection of sweet memories. The then vigourous job chart .good job at present.
From
Sri VenkateswarReddy
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much VenkateswarReddy
Sambasiva+Rao+Thota
గ్రామ ప్రజలకోసం చాలా చాలా కార్యక్రమాలు చేశారు మీ సేవలు అభినందనీయం అన్నయ్యగ్గారు
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Dhanyavaadaalu Seethakkaiah
Sambasiva+Rao+Thota
That’s wonderful
From
Sri Ramanaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramanaiah Garu
Sambasiva+Rao+Thota
మరొకరి జీవితంలో కి తొంగి చూడాలన్న ఆసక్తి మంచి స్వీయ చరిత్రల వలనే.కలుగుతుంది. అదే Facebook,Twitter Instagram, లాంటి సామాజిక మాధ్యమాలకి మూలం.సంచిక వల్ల అలాటివి రెండు చదవడం అలవాటే కాక addiction గా తయారు అయింది. రెండూ నేనెరగని తెలుగు దేశం నేపథ్యంలో, వేరే వృత్తుల వారివైనా మంచి రచనా శైలి వల్ల రాణిస్తున్నాయి.
వాటివల్ల నేర్చుకోని తెలుగులో పుస్తకం రాసే ధైర్యం వస్తుందని ఆశ.
Sri Someswar
Bangalore
Sambasiva+Rao+Thota
Someswar Garu!
Mee aasha neraveraalani manaspoorthigaa korukuntunnaanu
Sambasiva+Rao+Thota
Excellent services offered to farmers and rural poor . I hope many beneficiaries might have came out of poverty . Hats off to you sir.
From
Sri ChandrasekharReddy
Hyderabad
Sambasiva+Rao+Thota
ChandrasekharReddy Garu!
Thank you very much for your affectionate comments