నా పేరు సురేఖ దేవళ్ళ. నేనొక గృహిణిని. చదవడం అనేది నాకు ఇష్టమైన ఏకైక వ్యాపకం. ఆ ఇష్టంతోనే అనుకోకుండా ప్రతిలిపి అనే ఆప్‌లో రాయడం మొదలుపెట్టాను. ‘కలంస్నేహం’ అనే వాట్సాప్ సమూహం నన్ను ఆహ్వానించింది.. సాహిత్యానికి సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆ సమూహంలో… ఎలా రాయాలి, ఎలా రాయకూడదు అని.. సమూహంలోని ప్రతి ఒక్కరూ చాలా సహాయం చేశారు మంచి రచనలు చేయడానికి..
తర్వాత తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. మామ్స్ప్రెస్సో అనే ఆప్ వల్ల మొదటిసారి నా కథలకు పారితోషికం అందుకున్నాను.. ఆ ఆనందం వర్ణించలేనిది. ఉండవిల్లి గారి సూచనల మేరకు బయట పత్రికలకు నా రచనలు పంపడం మొదలుపెట్టాను.
‘కథల పూదోట’ అనే సంకలనంలో సింగిల్ పేజీ కథగా నా కథ ఒకటి ప్రచురితం అయ్యింది.
విశాఖ సంస్కృతి, గో తెలుగు.డాట్ కామ్, మాలిక, సంచిక, సుకథ, సహరి లలో నా కథలు ప్రచురితమయ్యాయి. ‘వార్త’ పేపర్లో ఒక కవిత ప్రచురితమయ్యింది. ‘తానా’ వారి అంతర్జాతీయ పితృదినోత్సవ పోటీలో నా కవిత ‘విశిష్ట బహుమతి’కి ఎంపికయ్యింది. కొన్ని ఎఫ్బి సమూహాల్లోని కథల పోటీలలో గెలిచి అపురూపమైన పుస్తకాలను కానుకగా అందుకున్నాను.
సాహిత్యం మనసును సేద తీర్చుతూ, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. బాధ అయినా, సంతోషం అయినా అక్షరాలలోనే వెతుక్కోవడం నా అలవాటు. ఆ రచనల వల్లనే కంటెంట్ రైటర్‌గా తొలి అడుగులు వేశాను..
రచనల వల్లనే ఎంతోమంది ఆత్మీయులు అయ్యారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా నాకు తెలిసినంతలో సహాయం చేస్తాను. అందరిలో ఒకరిగా ఉన్న నాకు ఓ ప్రత్యేకమైన గౌరవం అందించింది సాహిత్యం. తెలుగు పట్ల మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ రచనా రంగంలో ముందుకు వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
ssurekhad@gmail.com
అభినందనలు సురేఖ గారు.. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది.. మిమ్మల్ని మీరు మెరుగు పరచుకోడానికి పడే తాపత్రయం కనిపిస్తుంది.. చూస్తూండగానే ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళటం చూడాలంటే మీ దగ్గరే చూసాను.. రచనలు మెరుగుపరచుకోవటమే కాదు, మిగిలిన వారి రచనలపై సూచనలు చేయటం, తప్పొప్పులు సవరించటం, నచ్చిన చిత్రానికి మీదైన శైలిలో చిన్న చిన్న కవితలు రాయటం , నిర్మొహమాటంగా సమీక్ష చేయటం, కథలు రాయటంపై ఒక అవగాహన ఏర్పరచుకొని, రాశి కన్నా వాసికి ప్రాధాన్యత ఇస్తూ సాగుతున్నారు.. సురేఖ దేవళ్ళ కథా రచయిత్రి మాత్రమే కాదు, చక్కని సమీక్షకురాలు అని చెప్పగలను.. హృదయపూర్వక అభినందనలు 💐💐💐
You must be logged in to post a comment.
కోయిల
శిల
కాలంతోబాటు మారాలి – 7
కొత్త పదసంచిక-31
నేను నేనే..
ప్రక్షాళన
నమ్మకాలు
ఊరి చివర ఆ ఇల్లొకటి…!!
చదవదగ్గ మహనీయ వ్యక్తుల పరిచయాలు – తేజోమూర్తులు
బ్రిటిష్ బంగ్లా-2
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®