“బిడ్డగా పుట్టి బుడిబుడి అజ్జలు నడచి కింద పడి ఏడ్చి పైనకి ఎక్కి నగి (నవ్వి) అమ్మకి, అబ్బకి, తాతకి, అవ్వకి, ఇంటి వాళ్లకి, వీది వాళ్లకి, బందువులకి అందమైన బందమైన నేను…”
“నా సావాసగాళ్ళ జతల ఎగరలాడి, దుమకలాడి, ఆటలు ఆడి, పాటలు పాడి, ఇస్కూలు పాఠాలు, వీది గుణపాఠాలు నేర్చిన నేను…”
“ప్రేమించి, మోసం చేసి, కామించి, కామంతో కండ్లు మూసుకు పోయిన నేను…”
“ఆడ పోయి, ఈడ పోయి, అది చూసి, ఇది చేసి, దుడ్డు, కాసు సంపాదిచ్చి, గడ్డి తిని, రాజకీయమై రంగరించిన నేను…”
“ఇల్లు, సంసారం, ఆశ, పాశాలు, బాధలు, ఓర్పులు, నేర్పులు, విజయాలు, అపజయాలు చవి చూసిన నేను…”
“కొండల్ని పిండికొట్టి, నదులకి అడ్డం వేసి, పంటలు పండి, వంటలు తిని, హంసలా ఆయిగా ఆకాశన ఎగిరిన నేను….”
“నేను… నేను… నేను…”
“కడకి ఏమైపోతాను…”
“0 – 0 = 0”
“0 + 0 = 0”
“0 x 0 = 0”
“0 ÷ 0 = 0”
***
అజ్జలు= అడుగులు
4 Comments
Arun
Nice
Mr.madhuvasanth@gmail.com
Nice
K.muniraju
డాక్టర్ వసంత గారు రాసిన కథ అజ్జలు చాలా బాగుంది రచయితకు ధన్యవాదాలు
Raghunadhara reddy
Good story