మాతృ భాష అతనికి దూరంలో – అతను పరభాష ఊబిలో . మాతృభూమి ప్రకృతికి దూరంలో – భూమాత ప్లాస్టిక్ ఊబిలో. మాతృ భాషను విడిచి వెళ్తున్న అతను – పరభాషా వ్యామోహం వద్దంటున్న అంతరంగం. మాతృభూమిని విడిచి వెళ్తున్న ప్రకృతి – ప్లాస్టిక్ వ్యామోహం వద్దంటున్న భూమాత అంతరంగం. మాతృభాషకు అతను సుదూరం – అందుకే పరభాష ఎంతో మధురం. మాతృ భూమికి ప్రకృతి సుదూరం – అందుకే ప్లాస్టిక్ ఎంతో మధురం. మాతృభాష శబ్ద సౌందర్యం ఆ రోజుల్లో మైమరపించింది – నేడు ఆ శబ్ద సౌందర్యం మూగవోయింది. మాతృభూమి ప్రకృతి సౌందర్యం ఆ రోజుల్లో మురిపించేది – నేడు ఆ ప్రకృతి కృంగిపోయింది. మాతృభాషయే ఆనాడు దేశభాషలందు లెస్స – నేడు వెనుకపడిపోతున్నామన్న బిడియము. మాతృభూమి ఆనాడు పంచభూతములందు లెస్స – నేడు క్షిణించిపోతున్నామన్న సంకోచము. మాతృ భాషలో తీయదనాన్ని గుర్తుతెచ్చుకోండి – క్షీణించి పోతున్న తేట తెనుగుకు పునర్జీవనం కలిగించండి. మాతృ భూమిలో ప్రకృతిని గుర్తు తెచ్చుకోండి – క్షీణించి పోతున్న పచ్చదనానికి పునర్జీవనం కలిగించండి.
పితలాటకం
కుందనపు బొమ్మ
బివిడి ప్రసాదరావు హైకూలు 15
సంచిక – పద ప్రతిభ – 134
సర్వ మత సమానత్వాన్ని ఆచరించిన శ్రీ శిరిడీ సాయిబాబా
కవులూ కళాకారులతో ‘కరచాలనం’ పుస్తకావిష్కరణ సభ – ప్రెస్ నోట్
బిచ్చగాడు
చిట్టితల్లి శతకం-4
స్వాతంత్ర్యవీరుడు – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
బివిడి ప్రసాదరావు హైకూలు 3
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®