సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రవణ్ కుమార్ జొన్నలగడ గారి స్పందన: *వందే గురు పరంపరాం — ఈ శీర్షికతో తెలుగు సాహిత్య వేదిక ద్వారా గురుత్వాన్ని ప్రతిఫలించే ధారావాహికను అందిస్తూ, అనేక మంది గురువులను మనకు పరిచయం చేస్తున్న శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మీ గారికి మనఃపూర్వక నమస్సులు.
    ఈ శీర్షికలో భాగంగా, రంగస్థల నాటక రంగంలో అనేక ప్రయోగాలు చేసిన ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాత, సంగీత దర్శకులు, రచయిత డా. పి.వి.ఎన్. కృష్ణ గారి నాటక ప్రస్థానాన్ని విశ్లేషిస్తూ, విశదీకరించి, పరిశోధనాత్మకంగా ఈ నెల సంచికలో అందించడమూ గొప్ప విశేషం.
    నవరస భరితం నాటకం -సర్వకళల సమన్వితం నాటకం
    మనోజ్ఞమై రసానుభూతితో మైమరపించేది నాటకం
    నాటకరంగాన్ని జీవిత ధ్యేయంగా తీసుకుని, కృషితో దానిలో విశిష్ట స్థానాన్ని సాధించిన కృష్ణ గారు ఈ రోజు మనకు ఒక మార్గదర్శకంగా నిలిచారు.
    *నాటకం ఎలా ఆడాలి? ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి?
    పాత్రధర్మం ఏంటి? నాటక ఆధునీకరణ ఎలా ఉండాలి?
    దర్శకత్వం అంటే ఏమిటి? నాటకాన్ని సమగ్రంగా ఎలా తీర్చిదిద్దాలి?*
    ఇలా ఎన్నో కోణాల్లో కృష్ణ గారు చేసిన అధ్యయనం ,ఈనాటి యువతకు ఒక బోధనగా, ఒక దిశానిర్దేశకంగా నిలుస్తోంది.ఆయన అందించిన సందేశాత్మక నాటకాలు విలువల ప్రాతిపదికతో నిండి ఉన్నవే.
    ఆయనపై మీరు వెల్లడించిన అంశాలు – ఒక పరిశోధన గ్రంథం కి బీజాంశాలుగా మారేంతగా ఉన్నాయి. మా వంటి అభ్యాసకులకు అవి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయన్న నమ్మకంతో, భగవంతుని అనుగ్రహంతో, ఈ పద్యనాటక యజ్ఞంలో ఆయన శిష్యుడిగా ముందుకు సాగుతున్నందుకు నిర్వచనాతీతమైన ఆనందం కలుగుతోంది.
    గురు దేవో భవ — గురువు భగవంతుని సాక్షాత్కారమే!
    శ్రవణ్ కుమార్ జొన్నలగడ
    ప్రధాన కార్యదర్శి, సంస్కార భారతి – విజయవాడ మహానగర్.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రావాడ శ్యామల గారి వ్యాఖ్య: *డాక్టర్ పి వి ఎన్ కృష్ణ గారి జీవితం గురించి.. ఆయనకు వరించిన పురస్కారాలు.. బహుమతులు.. చాలా చక్కగా వివరించారు. ఇటువంటి వారు మన మధ్య ఉండడం మనకు గర్వకారణం. అద్భుతమైన వ్యక్తితో ఇంటర్వ్యూ చేసిన మీకు ప్రత్యేక ప్రణామాలు..🙏💐*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుబ్బారావు పొణుగుపాటి గారి వ్యాఖ్య: *వందే గురు పరంపరామ్ – ఓ అద్భుతమైన ప్రక్రియ!
    మరో అద్భుతమైన వ్యక్తి గురించి పరిచయం!
    ముఖ్యంగా రచయిత్రి శ్రీమతి చివుకుల శ్రీ లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 👏
    డాక్టర్ పీవీఎన్ కృష్ణ గురించి ప్రత్యేకంగా అభినందించలేను! కారణం విషయం లేక కాదు! అందుకు తగ్గ భాషా పరిజ్ఞానం నాకు లేదని నా భావన!
    పనిలో పనిగా నన్ను నేనే అభినందించుకుంటున్నా., గర్వపడుతున్నా
    Dr pvn Krishna వంటి మహోన్నత కళాకారుడు నా మిత్రుడు అని చెప్పుకునే సదవకాశం కలిగినందుకు!*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!