[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘కంచికెళ్ళిన కొత్తకథ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కిక్కిరిసిన బతుకు సూపర్ మార్కెట్లో కొనుగోలుదారులమే మనందరం
ఎంచుకుని గమనించుకుని కార్టులో వేసేసుకుంటున్న ప్రతిదానికీ మూల్యం చెల్లించాల్సిందే పక్కాగా డిస్కౌంట్లు ఉండవు అన్నింటికీ సేల్ ఆఫర్లు అగుపడవు అన్నిసార్లు
అవకాశాలు ఆసరా ఇచ్చాయి కదా అని అర్హతలను దాటిన అంగలేసి ఆత్యాశతో.. అవసరాన్ని మించి కొంటూ ఆకట్టుకున్నదాన్నల్లా.. ఎగబడి బుట్టలో వేసేసుకుంటూ అందరినీ అటూఇటూ తోసేస్తూ దర్పంగా బిల్లింగ్ దగ్గరకెళ్ళిపోతాం
ఏదో తగిలి జేబు చిరిగిందా..? యశస్సు చిల్లరై నేలజారిపోతుంది బతుకు బందరు బస్టాండైపోతుంది
ఇంకేదో జరిగి కర్మే కాలిందా..?? కాలం పర్సు ఆమాంతంగా ఖాళీ అయిపోయి ఆయుష్షు రొక్కం హటాత్తుగా నిండుకుంటుంది
అంతే..! కంచికెళ్ళిపోయిన కథల్లో కొత్తదొకటి యాడ్ అవుతుంది కొంతకాలం ఫ్రెష్‌గా చెప్పుకునేటందుకు
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
The Real Person!
మనుషుల జీవితాలకు సంబంధించి అంతర్లీనంగా ఇచ్చిన సందేశం చాలా బాగుంది. మనం కొనుక్కున్న వస్తువులు ఎన్నో మనం వెళ్లిపోయిన తర్వాత, తర్వాతి తరానికి దేనికి కొరగావు. అంతే కాకుండా అనవసరమైన వస్తువులను సంపాదించుకోవడానికి, అనవసర విషయాలకు ప్రాముఖ్యతలనిస్తూ జీవితాన్ని దుర్బరం చేసుకుంటూ ఉంటాం . ఇందులో ఎటువంటి సందేహం లేదు. కవిత, వస్తువు వలచిన శిల్పం తీరు అద్భుతం. మిస్టర్ శ్రీధర్ !అభినందనలు .
బాగుంది సర్
బాగుంది అండి కవిత. నేడు ఆఫర్స్ అంటూ పెట్టి, వినియోగ దారులను దారి మళ్ళిస్తున్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ కు చురక లాంటిది మీ కవిత. ప్రజలు అర్ధం చేసుకోవాలి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి – ప్రకటన
చిరుజల్లు-95
కావలెను
నూతన పదసంచిక-27
సంగీత సురధార-26
స్వామీ వివేకానంద, మహాత్మా గాంధీల దృక్పథంలో ‘మనిషి’
అలనాటి అపురూపాలు – 226
అంతరంగ పరివర్తన కాంక్షించే ‘యోగక్షేమం వహామ్యహం’
బుద్ధం శరణం గచ్ఛామి
భూమి నుంచి ప్లూటో దాకా… -5
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®