“శేషయ్య గారూ, ఇతను కృష్ణదాసు అని నా సహోద్యోగి. పరోపకారి. పని రాక్షసుడు… క్లుప్తంగా చెప్పాలంటే, సంస్కారవంతుడు.”
పురుషోత్తం తన సహోద్యోగిని శేషయ్యకి పరిచయం చేశాడు రామకృష్ణ మఠంలో.
కృష్ణదాసు నల్లగా ఉన్నా, నవ్వుతూ నమస్కారం పెట్టడంతో వెలుగు పరుచుకున్నట్లనిపించింది శేషయ్యకి.
శేషయ్య ప్రతినమస్కారం చేయబోతే, కృష్ణదాసు వారించాడు.
“సహస్రచంద్ర దర్శనం చేసిన వయస్సు మీది. మీకన్నా వయస్సులో చాలా చిన్నవాణ్ణి. మీరు నమస్కరిస్తే నాకు ఆయుక్షీణం. ఆశీర్వదించండి” అంటూ వినయంగా అన్నాడు కృష్ణదాసు.
శేషయ్య ఆశీర్వదించారు.
” ఇతను మంచి భక్తి కవిత్వం కూడా రాస్తాడండీ.” పురుషోత్తం జోడించాడు.
“ఆహా, ఏదీ మచ్చుకి ఒకటి వినిపించగలరా – మీకు అభ్యంతరం లేకపోతే…” అన్నారు శేషయ్య.
కృష్ణదాసు కళ్ళు మూసుకొని, భక్తినిండిన స్వరంతో చెప్పాడు:
“స్వచ్ఛమైన ఆత్మ నన్ను చేరి మలినమయ్యె,కడగాలని మనసు మాలిన్యంపిలుచు లోపు నిన్ను, కృష్ణా,ఆత్మతో జతకట్టి మనసెగిరిపోయె…”
‘ఏమి తన్మయత్వం!’ అనుకున్నారు శేషయ్య.
వాళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటూండగా, పురుషోత్తాన్ని ఇంటికి తీసుకెళ్ళటానికి అతని మేనకోడలు (సాఫ్ట్వేర్ ఇంజినీర్) వచ్చింది. కొత్తగా ఈ నగరంలో ఉద్యోగంలో చేరటానికి బెంగుళూరు నుంచి రాబోతోందని ఆ మధ్య పురుషోత్తం చెప్పిన సంగతి శేషయ్యకి గుర్తుకొచ్చింది.
ఆ మే.కోకి శేషయ్యగారిని పరిచయం చేశాడు పురుష్.
మే.కో చిరునవ్వు చిందిస్తూ, ‘హల్లో’ అంటూ కరచాలనానికి శేషయ్యకి తన కుడిచేయి అందించింది.
శేషయ్య కూడా ఒక నవ్వు నవ్వారు. ‘ఆయుష్మాన్ భవ’ అంటూ ఆశీర్వదించి, కరచాలనం చేశారు.
***
కార్తీకమాసం వచ్చింది.
ఒక సోమవారం నాడు పురుషోత్తం తన ఇంట్లో చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం, అది అయ్యాక సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవాలనుకున్నాడు. ఎవరో చెప్పారని గణపతి హోమం కూడా చేర్చాడు.
శేషయ్యకి ఆ ఆదివారం రామకృష్ణ మఠంలో కలిసి నప్పుడు మరీ మరీ చెప్పాడు.
“మీరు తప్పకుండా రావాలి.”
శేషయ్య తనకేదో పని ఉందని, రాలేకపోవచ్చని చెప్పారు.
పురుషోత్తం వదల్లేదు.
“మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. మీరు వచ్చి, వ్రతం అయ్యేదాకా ఉండి, మా కుటుంబాన్ని ఆశీర్వదించాల్సిందే…”
శేషయ్య ఆలోచించారు.
“సరే, నా కార్యక్రమాన్ని కొంచెం సవరించుకొని వస్తాను… నీ సహోద్యోగి కృష్ణదాసు చేత భక్తి కవితలు పాడిస్తావా?”
“………. …. “
“ఏమైంది పురుషోత్తం? అతను బాగున్నాడు కదా!”
“ఆ.. అతను బాగానే ఉన్నాడు. కాని….”
“ఏం? మీ ఇద్దరికీ చెడిందా?”
పురుషోత్తం నసుగుతూ, “వాళ్ళది కల్లుగీత కుటుంబం సర్.. ఈ హోమాలూ అవీ వాళ్ళకి అలవాటు ఉండవు… ఎందుకు అతన్ని పిలిచి ఇబ్బంది పెట్టడం…?” మెల్లగా బయటపడ్డాడు.
శేషయ్యకి అర్థమైంది. ఆయనకి నచ్చలేదు.
“పురుషోత్తం. ఒక వాస్తవ కథ చెబుతా, విను. కాశీరాజు అంతఃపురంలో పెద్దవాడయిన ఒక చర్మకారుడు రాత్రిపూట పహారా కాసే ఉద్యోగంలో ఉండేవాడు. ఒకసారి అతనికి ఒంట్లో బాగా లేక, తన కొడుకుని పంపాడు. అతను యువకుడు… ఆ రాత్రి అతను అంతఃపురం పహరాలో ఉన్నాడు… రాత్రంతా చక్కగా మేలుకొని పహరా కాశాడు… అయితే, మరునాడు రాజుగారికి రాణిగారి దగ్గరనుంచి ఒక ఫిర్యాదు అందింది. వెంటనే రాజుగారు ‘ఆ పహరా కాసిన యువకుడిని తీసుకు రండి..’ అని ఆజ్ఞాపించారు…”
“అర్థమైంది సర్…” అని ఏదో అనబోయాడు పురుషోత్తం.
“అబ్బే, అసలు కథ మొదలయిందే ఇక్కడ.”
పురుషోత్తానికి అయోమయంగా ఉంది.
“చెప్పండి సర్.”
“రాజుగారు ఆ యువకుడిని ప్రశ్నించారు. ‘నువ్వు రాత్రంతా రాణిగారికి నిద్రలేకుండా చేశావట. నిజమేనా?’ ఇంతే అడిగారు. దానికి ఆ యువకుడు, ‘నాకు తెలియదు ప్రభూ. నేను నాకు తోచిన పాటలు పాడుకుంటూ పహరా కాశాను. అంతే’ అన్నాడు. ‘ఏం పాటలు? ఒకసారి పాడు, చూస్తాను..’ అన్నాడు రాజుగారు.”
ఇక్కడ ఆపారు శేషయ్య.
పురుషోత్తానికి ఆత్రంగా ఉంది మిగతా కథ వినాలని.
“ఏమని పాడాడు సర్?”
“నీకెందుకు రాస్తారు, దాస్తారు కథల్ని తాళపత్రాల మీద రేపటి తరాల జ్ఞానం కోసం, మమ్మెందుకు చూడనీరు, చదవనీరు, మేమెక్కేదీ ఆ తాళ్ళే ఈనాటి జానెడు పొట్ట కోసం?’ …
ఇలా భగవంతుణ్ణి ధ్యానిస్తూ పాడాడయ్యా. ఆ పాటల్లో భక్తితత్త్వానికి కాశీరాజు పరవశించిపోయాడు. అతడిని ఘనంగా సన్మానించాడు. అతని కోసం ఇప్పుడు కాశీలో ఒక గుడి కట్టి పూజిస్తున్నారు. అతని పేరు సూరదాసు లేదా రవిదాసు. మీ కృష్ణదాసులో ఆ భక్తి, ఆర్తి ఉన్నాయి పురుషోత్తం… తన భక్తుల్ని సేవించేవాళ్ళనే తానూ ప్రేమిస్తానని పరమాత్మ చెప్పలేదా…!”
అంతే! కృష్ణదాసుని కూడా పురుషోత్తం ప్రేమతో ఆహ్వానించాడు.
అమెరికా నుంచి హైద్రాబాద్ వెళ్తున్న విమానాన్ని ఢిల్లీలో ఎక్కారు శేషయ్య.
పక్క సీట్లో సుమారు 30 ఏళ్ళ యువకుడు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు.
….
అంతలో విమానంలో సేవాసుందరి ప్రకటించింది:
“ఫోన్లు ఆఫ్ చేసేయండి దయచేసి.”
శేషయ్య ఆ యువకుడిని పలకరించారు. తన పరిచయం చెప్పారు.
ఆ యువకుడు చాలా మర్యాదగా ప్రతిస్పందించాడు.
“హల్లో అంకుల్. దిసీజ్ ఆనంద్. ఐయాం కమింగ్ ఫ్రమ్ సెయింట్ లూయీస్ …”
“ఏ ఊళ్ళో పుట్టావు బాబూ?”
“ముంగండ …. దట్ ఈజ్ ఇన్ కోనసీమ. యు నో ఇట్?”
విమానం గాల్లోకి ఎగిరింది.
“ఎందుకు తెలీదయ్యా! ఆ సీమలో వేద పండితులు పెద్ద పెద్ద వాళ్ళు పుట్టారు.”
“యస్ అంకుల్. ‘ప్రెస్ సెక్రటరీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ కూచి సూర్యనారాయణ వజ్ ఫ్రమ్ అవర్ ముంగండ..” ఎంతో గర్వంగా చెప్పాడు విశ్వాస్.
“మరి నువ్వేంటి? ఆంగ్లభాషలో మాట్లాడుతున్నావ్? అక్షరాభ్యాసం తెలుగులో జరగలేదా? మీ అమ్మ తెలుగువారు కాదా? నువ్వు పుట్టినప్పట్నుంచి అమెరికాలోనే ఉన్నావా?… “
ఇలాంటి ప్రశ్నలన్నీ ఒక్కసారే కుమ్మరించారు శేషయ్య.
విశ్వాస్ సిగ్గు పడిపోయాడు.
“అంకుల్, నేను సెవెంత్ క్లాస్ వరకే ముంగండ. లేటర్ మా బ్రదర్ నన్ను అమెరికా తీస్కెళ్ళారు… సో….”
“అవునయ్యా, అక్కడ తెలుగువాళ్ళు లేరా! తెలుగు మాట్లాడరా?”
“ఉంటారు. బట్, అన్లెస్ తెలుగు మాట్లాడాల్సి వస్తే తప్ప, ఎక్కువ అంతా ఇంగ్లీషే అంకుల్… నేను అక్కడ సంఘాలు, సభలు వెరీ తక్కువ అటెండింగ్ అన్నమాట…”
“అరెరే…” శేషయ్య నొచ్చుకున్నారు.
“సో వ్హాట్ అంకుల్. నాకు వచ్చిన తెలుగు ఎనఫ్ కదా!”
“ఓకె… ఎప్పుడూ తెలుగు రాష్ట్రానికి రాలేదా?”
“నో… అఫ్ కోర్స్, ఒన్ ఆర్ టు టైమ్స్ వచ్చినా, ఈ తెలుగు ఎనఫ్ అంకుల్. ఐ నో ఆల్ మై రిలేటివ్స్….”
శేషయ్య ఆనంద్ వంక జాలిగా చూశారు.
“ఇప్పుడు నీ రాక విశేషం ఏమిటి?”
“నెక్స్ట్ వీక్ నాకు పెళ్ళి అంకుల్…. తను కూడా అమెరికాలోనే ఉంటుంది. వుయ్ లైక్ ఈచ్ ఒదర్… బట్, పెళ్ళి ఇక్కడే… ” కొంచెం సిగ్గుపడ్డాడు విశ్వాస్
“మరి నీ బంధువులు అందర్నీ గుర్తుపట్టగలవా?”
“వై నాట్ అంకుల్? మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ నౌ టు రిసీవ్ మి.”
“ఓ, గుడ్.”
శేషయ్య గురించి ఆనంద్ చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే తన ఉద్యోగం గురించి చెప్పాడు. ఓ గంటలో దగ్గరైపోయారు. సమయం తెలియలేదు.
విమాన సేవాసుందరి ప్రకటించింది:
“కొద్ది సేపట్లో హైదరాబాదులో దిగుతున్నాం…”
“అంకుల్, మా రిలేటివ్స్ అందర్నీ చూపిస్తా. అంకుల్, ప్లీజ్ కమ్” అన్నాడు విశ్వాస్.
విమానం దిగాక, విమానాశ్రయంలో ఓ ఇరవై మందిదాకా దగ్గర బంధువులంతా వచ్చారు. ఉత్సాహంగా విశ్వాస్ని చుట్టుముట్టేశారు.
విశ్వాస్ వాళ్ళందర్నీ శేషయ్యకి పరిచయం చేశాడు.
“ఈయన పెద్ద అంకుల్. ఆయన చిన్న అంకుల్.. అతను నా ఫస్ట్ కజిన్. ఆ అమ్మాయి ఓ కజిన్ సిస్టర్ … షి ఈజ్ సిస్టర్-ఇన్-లా..”
శేషయ్య పగలబడి నవ్వారు.
“విశ్వాస్. ఇప్పటికైనా అర్థం చేసుకో మాతృభాష విలువ ఏమిటో. వీళ్ళందర్నీ నువ్వు తెలుగులో ఎంత బాగా పరిచయం చేయగలవంటే – పెదనాన్న, చిన్నాన్న, మేనమామ, వేలు విడిచిన మేనమామ, మేనత్త, వదిన, మేన కోడలు, మేనల్లుడు, మేన బావ, మరదలు, మాతా మహుడు, పితా మహుడు, పెద్దమ్మ కొడుకు, పినతల్లి కూతురు …. ఎంత స్పష్టంగా ఉంటుంది ఆ పరిచయం! ఎంత ఆత్మీయత ఉట్టిపడుతుంది ఆ పిలుపులో…! వినటానికి ఆ పిలుపు వాళ్ళకెంత ఆనందంగా ఉంటుంది!!”
విశ్వాస్ సిగ్గుపడిపోయాడు. కాని, తెలుగు పౌరుషం తన్నుకొచ్చింది.
“యు మస్ట్ కమ్ టు మై వెడ్డింగ్ … సారీ, నా పెళ్ళికి తప్పక రండి అంకుల్. వారం తరువాత యు విల్ సీ అచ్చంగా తెలుగు విశ్వాస్…”
బంధువులంతా విశ్వాస్కి జై కొట్టారు.
వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు. ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక (2005-15) కు ప్రధాన సంపాదకులు. ‘జుగల్బందీ ‘ (అద్వానీ-వాజపేయిల బంధం), ‘నిప్పులాంటి నిజం’ (రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు), ‘నరసింహుడు’ (పి.వి. నరసింహారావు సమగ్ర జీవిత కథ), ‘రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల…’ (ప్రజా జీవితాలపై ఆర్.బి.ఐ ప్రభావం) వీరి అనువాద రచనలు. శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, IAS, గారి – ‘నాహం కర్తా, హరిః కర్తా’; ‘తిరుమల లీలామృతం’, ‘తిరుమల చరితామృతం’, ‘అసలేం జరిగిందంటే …!’ – పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. ‘ఇదీ యదార్థ మహాభారతం’ (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 రోజుల ప్రవచనాలకు) లిఖితరూపం ఇచ్చారు. ‘అయినా నేను ఓడిపోలేదు ‘ (జ్యోతిరెడ్డి ఆత్మకథ), ‘వైఎస్సార్ ఛాయలో … (సి.ఎం మీడియా సలహాదారుగా స్వీయ అనుభవాలు), ‘వాల్మీకి రామాయణం ‘ (పిల్లల కోసం 108 తైల వర్ణ చిత్రాలతో ఎమెస్కో ప్రచురణ) వీరి ఇతర రచనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అదృశ్య శత్రువు
‘మా మంచి మాస్టారు’ పి. లక్ష్మీపతి రాజు గారు
శ్రీరామ రక్ష
కాయలలో కళాకృతులు
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 23 – దాస్తాన్
ప్రముఖ విమర్శకులు కే.పి. అశోక్ కుమార్కు ‘లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం’
ప్రత్తిపాటి నానీలు
శ్రీపర్వతం-59
నాడు – నేడు
ఫొటో కి కాప్షన్-34
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®