సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    విలువైన వ్యాసం. ఆచార్య సుప్రసన్న వారికి నమోనమః

  2. 2

    శరచ్చంద్రిక

    నేను చదివిన కవి సామ్రాట్ వారి మొట్టమొదటి రచన – నవల చెలియలి కట్ట.

    చెలియలి కట్ట చదివాక , విశ్వనాథ వారి రచనలు చదవాలి అంటే భాష మీదనే కాదు, సనాతనధర్మం మీద కూడా అవగాహన ఉండాలి అని నాకు అనిపించింది. వెంటనే ఆసక్తి కొద్దీ , ‘అసలు విశ్వవిద్యాలయాల్లో తెలుగు MA లో వారి రచనల మీద ఎంత చెప్తున్నారు’ అని చూద్దాం అని చూసాను. దాదాపు 5-6 curriculum లు చూసాను ఒకటో అరా తప్పించి ఎక్కడా వారి రచనల గురించిన బోధనా అంశాలు కనపడలేదు. MA తెలుగు కూడా ఈ కేంద్రీయ సాహిత్య అకాడమీ లాగే కమ్యూనిస్టుల తో నడుస్తుంది కాబట్టి వారి రచనలు భూస్థాపితం చేసేందుకే కంకణం కట్టుకుంటాయేమో ఈ విశ్వవిద్యాలయాలు అనిపించింది మరి . దానికి తోడు నాకు జరిగిన స్వానుభవాలు కూడా అలా అనిపించేలా చేసాయి. ఓ బుక్ క్లబ్ లో ‘వేయిపడగలు చదువుదామా’ అని అడిగితే , కొందరు ‘వేయిపడగలు చదవం’ అంటూ ఖచ్చితంగా చెప్పారు .

    ఈ వ్యాసం చదివాకా చాలా ఆనందం వేస్తోంది. ఎన్నో పరిశోధనలు చేయచ్చు అనిపిస్తోంది కూడా.

    విశ్వనాథ వారు భారతదేశంలో, అందునా తెలుగు వారీగా పుట్టకపోయి ఉంటే బాగుండేది. ఇలా ఆయన రచనలని భూస్థాపితం చేయకుండా ఆ ఇంకో జాతి ఆయనని ప్రపంచానికి తెలియజేసేదేమో అనిపిస్తోంది.

    ‘అదేంటి ఈ వ్యాసం చదివాక, ఇన్ని పరిశోధనలు జరిగాయి అని చెప్పినా కూడా ఇలా అంటారా’ అనచ్చు . షేక్స్ పియర్ ప్రపంచంలో ప్రతీ సామాన్యుడికి తెలుసుగా. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి కూడా తెలుసు. ‘మరి భారతదేశంలో పుట్టిన సాహిత్యాభిలాషులకి (సామాన్యులని పక్కన పెడితే) కవి సామ్రాట్ వారి గురించి ఎంత మందికి తెలుసు ?’ అన్నదే నా ప్రశ్న. ఇక్కడ కమ్యూనిస్టులు స్పష్టంగా విజయవంతం అయ్యారు.

    గిడుగు, గురజాడని బాగా వాడుకుంటూ- వాడుకభాషా ఉద్యమం అంటూ రోజూ పాడుకునే గజేంద్ర మోక్షం , భాగవతం పాడుకునే తెలుగు సామాన్యుడిని నెమ్మదిగా పద్యం నుంచీ దూరం చేశారు. తరువాత ఆంగ్ల మాధ్యమం లో చదువులు. సాహిత్యం అంటే చులకన . అందునా ‘తెలుగు ఎందుకు’ ? ఫలితం తెలుగు నేర్చుకోలేదు కొన్ని తరాలు. వారిప్పుడు అమెరికా వలస వచ్చారు.
    అమెరికాలో Kumon కి వెళ్లి డబ్బిచ్చి మరీ, కట్టలు కట్టలు ఇంటిపని తెచ్చుకునే ఈ తల్లిదండ్రులు ,’పిల్లలకి తెలుగు నేర్పిస్తారు అంటే ఏదో సరదాగా వస్తారు అనుకున్నాం , ఇంత ఇంటిపని ఇస్తారా ? అమ్మమ్మలతో , నానమ్మలతో మాట్లాడితే చాలు. పద్యం ఎందుకు ? అవసరం లేదు ‘ అంటూ మాట్లాడే స్థాయి కి వచ్చారు . అందరూ కాదు కొందరు. ఆ ‘కొందరే ‘ చాలు మార్పుకి తివాచీ పరవడానికి.
    అటువంటి వారికీ నాలాంటిది విశ్వనాథ వారి గురించి ఏమని చెప్తే ఏమర్థమవుతుంది ?

    నిజంగా ఇటువంటి వ్యాసాలు ఎడారిలో ఎండమావులే నాలాంటి సామాన్యులకి 🙏🙏 !

  3. 3

    గోనుగుంట మురళీకృష్ణ

    విశ్వనాధ వారి కాలంలో గల సాహిత్యం,ఇజాలు… అప్పటి పరిస్థితులు గురించి చాలా వివరంగా చెప్పారు. ఎంతో అనుభవజ్ఞులైతేనే ఇలా వివరించగలుగుతారు…..విశ్వనాధ వారి రచనల్లో ఏకవీర, ప్రళయ నాయకుడు, వీరవల్లడు , మిహిరకులుడు, నందోరాజా భవిష్యతి ….వంటి ఓ ఇరవై పుస్తకాల దాకా నాదగ్గర ఉన్నాయి…చిన్నప్పుడు పాఠశాలలో కడిమిచెట్టు, లవణరాజు వంటివి పాఠాలుగా ఉండేవి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!