బాపూ, నే చెప్పేది వింటావా నీ దేశం ప్రగతి తెలుసుకుంటావా పెరిగిపోతున్నాయయ్యా పెరిగిపోతున్నాయి పగలు, ప్రతీకారాలు కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు, విద్వేషాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు దొంగతనాలు, దోపిడీలు హత్యలు, అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయయ్యా పెచ్చరిల్లుతున్నాయి మానభంగాలు, భ్రూణహత్యలు కులమతద్వేషాలు, జాతిద్రోహాలు పదవీ పోరాటాలు, రాజకీయ ఆరాటాలు మానవహక్కుల భంగాలు, యధేచ్చగా ఉల్లంఘనలు అమ్మాయిల, అమాయకుల ధన మాన హరణాలు ఉగ్రవాదుల దుశ్చర్యలు, దొంగచాటు దాడులు ఎవరాపగలరు బాపూ, వీటన్నింటినీ, ఏరీ నాటి మహానాయకులు, మార్గదర్శకులు ఏరీ నాటి త్యాగధనులు, నిస్వార్ధపరులు ఏరీ నాటి మహాత్ములు, మహానుభావులు ఏరీ నాటి ఆదర్శపురుషులు, రాజకీయ దురంధరులు ఏరీ నాటి లోకమాన్యులు, లోకనాయకులు ఏరీ నాటి ఉక్కుమనషులు, హక్కుల రక్షకులు లేరయ్యా లేరు, ఎవరూ లేరు ఉన్నా కానరారు, బయటికి రారు, రాలేరు అందుకే నిన్నడుగుతున్నా రావయ్యా రావయ్యా నీవైనా మరొక్కసారి రక్షించవయ్యా నీ భారతావనిని మరోసారి
చెలిమి కలిమి
ధన్వంతరి చెట్టు
మనదైన వ్యక్తిత్వ వికాస గ్రంథం ‘నేర్పుగా జీవించడం ఎలా!’
విజ్ఞానపు విన్యాసం
హైదరాబాదులో ఆంధ్ర సారస్వత వికాసము
గురుదక్షిణ
చక్కని అనుభూతినిచ్చే ఆత్మకథాత్మక దీర్ఘకావ్యం ‘మా ఊరొక కావ్యం’
పదసంచిక-27
పుస్తకంలో.. పువ్వు
అరుదైన నటవహ్ని- బల్రాజ్ సహ్ని – 5 పునర్మిలన్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®