Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

42. తరలిపోతున్న మేఘమాల

2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.

నీటి చుక్కలన్నీ మింటకెగసి
మబ్బుల్లో దాగి పోతున్నాయి….!

కఠినమైన మబ్బులేమో
కురవని చినుకులను మోసుకుంటూ….
తరలి పోతున్నాయి ఏ తీరాలకో….!

ఎదురు చూస్తోంది నేలతల్లి…
ఒళ్ళంతా పగిలిన గాయాలతో….
చినుకు సవ్వడికై….!

కరిగిపోని మబ్బులు ససేమిరా అంటున్నాయి…
ఓ చిన్న చిరుగాలైనా స్పర్శించనిదే
మేమెలా కురవమని ప్రశ్నిస్తూ….!

మరిప్పుడు ఎక్కడికెళ్ళాలి ….
చల్లని చిరుగాలి కోసం
పచ్చదనాన్ని కోల్పోయి
బీడు భూమిగా మిగిలిన నేలతల్లి….!

జలం కావాలంటే
మనం…మనం చేయి కలిపి
వనాలు పెంచాలి…!
అప్పుడే ఆ వన దేవత ఒడిలో
సేద తీరుతుంది పుడమితల్లి…!!

Exit mobile version