Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

36. చిరునవ్వుకు ఆహ్వానం

2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.

దహారణాల పడతినే నేను
పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో ఉన్న పడుచునే నేను
పరవళ్ళు తొక్కే పరువమే నాది
కన్పించేదే నిజమని నమ్మే వయసే నాది

తారస పడ్డ చెలికానినే సర్వస్వమని నమ్మా గుడ్డిగా
గడప దాటి అడుగేశా యవ్వనపు పొరలుగమ్మి
మమకారాన్ని మసిచేశా కట్టుబాట్లు తప్పి
నిజస్వరూపమాతనిది నిగూఢమాయె కొన్ని దినములవ్వకనే

కష్టాలు, కన్నీళ్ళ నడుమ ఇద్దరు బిడ్డలతో మరింత భారమాయె
చెడు అలవాట్ల చెలునితో భవిష్యత్తే కానరాదాయె
ఆదరణ కరువై గడిపా జీవితం చేదుగా
చిన్నారులను చూసి సాగాలి ముందుకు ఒంటిగా

తెలుసుకున్నదొకటే చదువుకునే వయసులో నాకెందుకు తొందర
నాన్న బాట నడచి ఉంటే అయ్యేది కాదు బ్రతుకు చిందరవందర
అప్పుడు గుర్తుకొచ్చింది నాన్న పంచిన మనోధైర్యం
అప్పుడే గుర్తెరిగా అమ్మ నింపిన విలువల స్థైర్యం

నే నేర్చిన జీవిత సత్యాన్నేనలుగురికీ నేర్పాలి పాఠంగా
నా వారికి తోడై నడవాలి అండగా
నిస్సారమైన జీవితానికి స్వస్తి పలికా
చిరునవ్వుని ఆహ్వానిస్తూ అడుగు ముందుకేశా

Exit mobile version