Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

[డా. సారధి మోటమఱ్ఱి గారు రచించిన ‘2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

~

ఖాతరు చేయని గతాన్ని –
కల్ల చరితగా మార్చే తూరుపు..

ఖూనీ చేసిన చరితని –
ఒప్పలేని, మార్చలేని పడమట..

నేను చెప్పినదే వేదమని –
మాయ చేసే గణన మేధస్సు …

రంగుటద్దాల చట్రాలే నిజమని –
రంగులు పులిమే కుడి ఎడమలు..

ఈ మసక రంగుల హోలీ –
సత్య సత్యోదయాన్ని కానీకుంటే …

ఓ! విశ్వావసు! మాకు అందించవా –
తేట తెలుపున తేలియాడే యుగాది!!

Exit mobile version