పాలమూరు సాహితి అవార్డు-2024 కు కాంచనపల్లి రచన ‘పెంకుటిల్లు’ ఎంపిక
~
తెలుగు సాహిత్యరంగంలో విశేష కృషి చేస్తున్న కవులకు గత పదిహేను సంవత్సరాలుగా పాలమూరు సాహితి కవితాసంపుటాలకు పురస్కారాలను అందజేస్తున్నది.
2024 సంవత్సరానికిగాను ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు రచించిన ‘పెంకుటిల్లు’ కవితాసంపుటి ఎంపికైంది. త్వరలో కాంచనపల్లికి ఈ పురస్కారానికి గాను 5,116 నగదు మరియు జ్ఞాపిక శాలువతో సత్కారం ఉంటుంది. పురస్కారపు తేదీ తర్వాత ప్రకటించగలం.
– డా. భీంపల్లి శ్రీకాంత్
అధ్యక్షులు, పాలమూరు సాహితి
9032844017