సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఫణీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు. వ్యాస విస్తృతి భీతిచే హఠాత్తుగా ‘సమాప్తం’ అని పూర్తి చేసినట్టున్నారు. సి.నా.రె. ఉట్టంకించిన ఆధునికాంధ్ర కవిత్వ లక్షణాలకు 19వ శతాబ్దంలోనే జీజాలు పడ్డాయని సోదాహరణంగా మీరు నిరూపించిన తీరు బాగుంది. వస్తు నవ్యత, శైలీ నవ్యత, నూతన ప్రక్రియలు పరిఢవిల్లిన విషయం సత్యప్రామాణికంగా చూపారు.
    చాలామంది లాగానే నేనూ దక్షిణాంధ్ర యుగాన్ని విహంగ వీక్షణం చేసాను. మీ లోచూపు అద్భుతం. అంగీకరింపజేసారు.
    యుగకర్తగా ” వీరేశలింగం” గారిని, వైతాళికులు గా మీరు పేర్కొన్న వారిని అంగీకరించక తప్పదు. నాటి కొన్ని పేలవమైన శృంగార కావ్యాల వెల్లువ వల్ల “క్షీణ యుగం” (అంధ యుగం) అనక తప్పదు, కానీ 20వ శతాబ్దపు నవ్య కవితా రీతులకు బలమైన పునాది వేసిన మహానుభావులున్నారని తెలియజేసినందుకు మీకు అభినందనలు.
    నిజమే. “ఉషోదయ యుగం” గానో, మరేదైనా మంచి పేరుతోనో పేర్కొనడమే మంచిది – క్షీణ అనకుండా.
    మీ ప్రతిపాదనను విజ్ఞులైన సాహితీవేత్తలు పరిశీలింతురు గాక!
    శుభం.

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    పిహెచ్. డి పట్టా కోసం ఏదో శోధన చేసి ‘పరిశోధన’ పేరున సమర్పించే వారే ఎక్కువ ఉన్న ఈరోజుల్లో, ఒక వివాదాస్పదమైన కాలాన్ని తీసుకుని, పెద్దలు పేర్కొన్న విధానాన్నే చదువుకుంటూ వస్తున్న సాహిత్య విద్యార్థులకు నూతన దృక్కోణాన్ని కలిగిస్తూ, సోదాహరణపూర్వకంగా గొప్ప పరిశోధన గ్రంథం రాసిన మీకు మరోసారి అభినందనలు.. సాహితీ లోకాన్ని ఒక కుదుపు కుదిపేస్తుంది మీ సిద్ధాంతం

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!