Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

16వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ పురస్కారాలకు చిన్న కథలకు ఆహ్వానం – ప్రకటన

జాతీయస్థాయిలో గత పదిహేనేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడూ ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది.

కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగు చూడాలని, తద్వారా రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో.. నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే విజయవంతం చేయాల్సిందిగా అందర్నీ కోరుతున్నాము.

అత్యుత్తమ కథకు రూ. 2500/-, ఉత్తమ కథకు రూ.1500/-, మంచి కథకు రూ.1000/-, ప్రత్యేక బహుమతులు  రూ.500/- చొప్పున ఇద్దరికి ఇవ్వబడతాయి.

ఈ పురస్కారం కొరకు పంపే కథల నిడివి రాతప్రతిలో రెండు నుంచి 4 పేజీలలోపు, డి.టి.పిలోనైతే 2 పుటలు కాగితం ఒక ప్రక్కనే రాయాలి.  ఎటువంటి ఎంట్రీ ఫీజులేని ఈ పోటీలకు ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చు.

కథ పుటలపై రచయిత పేరు గానీ, ఆయా వివరాలు గానీ వుండకూడదు,  కేవలం హామీపత్రంపై మాత్రమే రచయిత వివరాలు పేర్కొనాలి. కథలను సెప్టెంబర్‌ 30వ తేదీలోపు రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్‌. కాంప్లెక్స్‌, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 (సెల్‌: 9247475975) అనే చిరునామాకు పంపాలి. విజేతలకు నగదు బహుమతులతోపాటు, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించి ప్రత్యేక సభలో సత్కరిస్తాము.

వశిష్ఠ సోమేపల్లి, అవార్డు కమిటీ

చలపాక ప్రకాష్‌, ఎడిటర్‌, రమ్యభారతి

Exit mobile version