జాతీయస్థాయిలో గత పద్నాలుగు ఏళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడాది కూడా ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది.
కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగు చూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో.. నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే విజయవంతం చేయాల్సిందిగా అందర్నీ కోరుతున్నాము.
బహుమతులు వివరాలు-
- అత్యుత్తమ కథకు ₹ 2500/-,
- ఉత్తమ కథకు ₹ 1500/-,
- మంచి కథకు ₹ 1000/-
- ప్రత్యేక బహుమతులు ₹ 500/- చొప్పున ఇద్దరికి ఇవ్వబడతాయి.
ఈ పురస్కారం కొరకు పంపే కథల నిడివి రాతప్రతిలో రెండు నుంచి 4 పేజీలలోపు, డి.టి.పిలోనైతే 2 పుటలు. కాగితం ఒక ప్రక్కనే రాయాలి.
ఎటువంటి ఎంట్రి ఫీజు లేని ఈ పోటీలకు ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. కథ పుటలపై రచయిత పేరుగానీ, ఆయా వివరాలు గానీ వుండకూడదు, కేవలం హామీపత్రంపై మాత్రమే రచయిత వివరాలు పేర్కొనాలి.
కథలను ఆగస్ట్ 30వ తేదీలోపు రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 (సెల్: 9247475975) అనే చిరునామాకు పంపాలి.
విజేతలకు నగదు బహుమతులతో పాటు, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి, ప్రత్యేక సభలో సత్కకరిస్తాము.
వశిష్ట సోమేపల్లి, అవార్డు కమిటీ
చలపాక ప్రకాష్, ఎడిటర్, రమ్యభారతి

1 Comments
Dr. Kothari vani chalapati Rao
రంగనాధం గారూ .. నమస్కారమండీ





రామాయణంలో కరెప్షన్ ( అవినీతి కథ )శీర్షిక మొదలుకొని సబ్జెక్టు వరకూ చాలా వెరైటీగా , ఆసక్తిదాయకంగా వుంది .. నేను వినని కథ . ఆ కుక్క మాటల్లో ఎంత లోతయిన అర్ధం వుంది . ముందు నేను కూడా ఇదేంటి ఇలాంటి శిక్ష అనుకున్నాను . తర్వాత తెలిసింది . ధర్మకార్యాలు , దైవకార్యాల నిర్వహణ చాలా జాగ్రత్తగా చేయాల్సింది ‘ అని ఈ కథ ద్వారా బాగా చెప్పారు.. అసలు ఈ కథ చెప్పాలన్న ఆలోచన మీకు వచ్చినందుకు మెచ్చుకోవాలి .. చివరలో ప్రస్తుతపు ఇష్యూ అయిన తిరుపతి లడ్డు తో జోడించి అసలు కల్తీ ఎందుకు జరగాలి అన్నదానిగురించి ఆలోచించరేం అని సంధించిన ప్రశ్న బాగుంది . మొదటి కుక్క కథకు, లడ్డుకథకు సామ్యం , లింక్ భలేగా సరిపోయాయి .
అభినందనలు.. మీ వ్యాసం ఈ రోజు ఒక కొత్తవిషయాన్ని తెలియచేసింది నాకు