Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

1. నిర్లక్ష్యానికి సాక్షిగా

2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.

ల్లని తారు రోడ్డు
తరచుగా పులుముకుంటుంది
రక్తం సింధూరంగా
కావాలని ఎవరూ గురి కారు
ప్రమాదాలకు
కాలప్రవాహం వేగ ప్రమోదం
కౌగిలించుకుని
అవుతుంది రక్త కలాపి జల్లు
అదిగో అక్కడ భూమిలో
సగం కూరుకుపోయి కనిపిస్తున్న
ఎర్ర రంగు మినీబస్సు
ఒకప్పుడది ఎంతో జోరుగా
స్వేచ్ఛగా విహరించినదే
ఇప్పుడది కాళ్ళులేని కుంటిలా
మానభంగం అయిన అనాధ యువతిలా
వెల వెల బోతూ లక్ష్యంలేని
డ్రైవరు కాళ్ళూ చేతులకు బలై
ముగ్గురిని బలి తీసుకుని మూలపడి ఉంది
డ్రైవరు అవిటివాడై కాస్తా నిదానం ఉంటే
తప్పేదికదా ప్రమాదం అన్న
పశ్చాత్తాపం తో మీ దానమే నాకు
ఆధారం అని విలపిస్తూ చేయి చాస్తూ
నడిబజారులో
నిర్లక్ష్యానికి సాక్షిగా నిల్చున్నాడు.

Exit mobile version