Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏడుండాడు

“సృష్టికర్త విశ్వకర్మ అని మన వేదాలులా అన్నిండారంట కదనా?”

“అవునురా”

“ఆది యందు దేవుడు బూమి, ఆకాశములను పుట్టించెను అని బైబిలులా చెప్పిండారంటనే”

“ఆ… ఆ… చెప్పిండారు రా”

“రెండు దినాలులా బుమిని, నాలుగు దినాలలా ఆకాశాన్ని… అల్లా దేవుడు పుట్టబడి (తయారు) చేసే – అని ఖురానులా వుందంటనే”

“అవును రా… అవును”

“అయితే సృష్టికర్త వుండాడంటావానా?”

“ఊరా”

“ఏడుండాడునా?”

“పరిణామక్రమ వాదంలారా”

***

ఏడుండాడు = ఎక్కడున్నాడు

Exit mobile version